వెల్లుల్లి చేసే మేలు తెలిస్తే షాక్ అవుతారు.. ఇంతకీ ఏం చేస్తుదో తెలుసా?

-

వెల్లులి ఘాటుగా ఉంటుందని చాలామంది కూరల్లో వేసుకోరు. వాసన పడదని కొందరు కూరల్లో వేసుకోరు. మసాలా పడక మరికొందరు దీన్ని దూరం పెడుతారు. దీంతో వెల్లులి వాడకం తగ్గుతుంది. ఇది వంట రుచిని పెంచడమే కాదు ఆరోగ్యానికి ఎలాంటి హాని చెయ్యకపోగా ఎంతో మేలు చేస్తుంది. వెల్లుల్లి ఉపయోగాలేంటో తెలుసుకోండి.

1 వెల్లుల్లి జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది అంతేకాకుండా రోగనిరోధక శక్తిని పెంచుతుంది. వెల్లుల్లిలోని యాంటీబయాటిక్ గుణాలు అజీర్ణం. హైబీపీలను తక్షణం నివారిస్తుంది. శరీరంలోని ఇమ్యునిటీ లెవల్స్‌ని వెంటనే పెంచుతుంది.

2. అధిక బరువుతో బాధపడేవారు రెండు పచ్చి వెల్లుల్లి రెబ్బల్ని తీసుకొని ముక్కలుగా చేసి మెత్తగా పేస్ట్ చేసి దానిలో కొద్దిగా తేనె కలిపి ప్రతిరోజూ ఉదయాన్నే పరగడుపున తీసుకోవాలి. ఇలా క్రమం తప్పకుండా నెలరోజుల పాటు తీసుకోవడం వల్ల తొందరగా బరువు తగ్గుతారు.

3. పచ్చి వెల్లుల్లిలో ఉండే అల్లెసిన్ అనే కంటెంట్ మెటబాలిజం రేటును పెంచుతుంది. ఇది కొవ్వు త్వరగా కరగడానికి సహాయపడుతుంది.

4. వెల్లుల్లి పేస్ట్‌ని చర్మంపై మొటిమలు, అలర్జీ వంటి వాటిపై రాస్తే ఉపశమనం కలుగుతుంది. రక్త నాళాల్లోని మలినాలు తొలిగిపోతాయి. మోకాలి నొప్పులతో బాధపడేవారు వెల్లుల్లి రసాన్ని మోకాలిపై నొప్పి ఉన్న చోట రాయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.

5. వెల్లుల్లి మన శరీరంలోని ట్రైగ్లిజరైడ్స్ తగ్గిస్తుంది. కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది.

6. వెల్లుల్లిని ప్రతిరోజూ ఉపయోగించడం వల్ల తరచూ వచ్చే జలుబుక ఉపశమనం కలుగుతుంది. అస్తమా, శ్వాస తీసుకోవడం వల్ల ఇబ్బంది, ఊపిరితిత్తుల రుగ్మతలు తగ్గించడానికి వెల్లుల్లి ఎంతో ఉపయోగపడుతుంది.

7. వెల్లుల్లి ఇన్సులిన్‌ను పెంచుతుంది. మధుమేహగ్రస్తుల్లో రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది.

8. వెల్లుల్లి గుజ్జును లేదా వెల్లుల్లిని ఉడికించిన నీటిని మొటిమలు ఉన్న ప్రదేశంలో ఐప్లె చేయడం వల్ల మొటిమలు మరియు మచ్ఛలను సమర్ధవంతంగా నివారిస్తుంది.

9. వారానికి 5 వెల్లుల్లిపాయలు పచ్చివి తినడం వల్ల కేన్సర్ వ్యాధిని 40 నుంచి 50 శాతం వరకు నిర్మూలించవచ్చు. కనుక దీనిని సర్వరోగ నివారిణి అనవచ్చు.

10. వెల్లుల్లిలో థయమిన్ లోపాన్ని తగ్గించి అభివృద్ధి చేసే గుణం పుష్కలంగా ఉంది. వెల్లుల్లిలో విటమిన్ సి అధికంగా ఉండడం వల్ల నోటి వ్యాధులకు దివ్యౌషధంగా పనిచేస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news