ఆ మంత్రుల విష‌యంలో జ‌గ‌న్‌కు ఎందుకింత క‌న్‌ఫ్యూజ‌న్‌..!

-

ఏపీలో ఇన్ చార్జి మంత్రుల విషయంలో గందరగోళం కొనసాగుతూ  ఉన్నట్టుగా ఉంది.  జ‌గ‌న్ కేబినెట్ ఏర్ప‌డిన నాలుగు నెల‌ల‌కే ఇన్‌చార్జ్ మినిస్ట‌ర్ల విష‌యంలో మార్పులు, చేర్పులు చోటు చేసుకున్నాయి. ముందుగా ఒక్కో మంత్రికి ఒక్కో జిల్లా బాధ్య‌త‌ను అప్ప‌గించారు. నాలుగు నెల‌ల‌కే వాళ్ల‌లో కొంత‌మందిని మార్చేశారు. కొత్త‌వాళ్ల‌కు అవ‌కాశం ఇచ్చారు. ఇన్‌చార్జ్ మంత్రుల్లో ఎవ‌రు అయితే స‌రిగా ప‌నిచేయ‌డం లేదో ?  ఎవ‌రు అయితే ఆయా జిల్లాల్లో పార్టీని బ‌లోపేతం చేయ‌లేర‌న్న విష‌యం జ‌గ‌న్ దృష్టికి చేరిందో వాళ్ల‌ను త‌ప్పించేసి… ఆయా స్థానాల్లో కొత్త వారికి బాధ్య‌త‌లు అప్ప‌గించారు.

ఇన్‌చార్జ్ మంత్రుల మార్పు అలా జ‌రిగిందో లేదో వెంట‌నే మళ్లీ మరో మార్పు చోటు చేసుకోవడం గమనార్హం. ఇది ప్రకాశం జిల్లా విషయంలో. మొదటగా ఈ జిల్లాకు జలవనరుల శాఖా మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ను ఇన్ చార్జిగా నియమించారు. నాలుగు నెలల అనంతరం మార్పు జరిగింది. ఇప్పుడు ఆర్థిక మంత్రి బుగ్గ‌న రాజేంద్ర‌నాథ్‌రెడ్డికి ఈ జిల్లా బాధ్య‌తలు అప్ప‌గించారు. అయితే ఇంత‌లోనే మ‌ళ్లీ మార్పు జ‌రిగింది. తాజా మార్పుతో సాంఘిక సంక్షేమ శాఖా మంత్రి పినిపె విశ్వరూప్ ఇన్ చార్జిగా వచ్చారు.

ఇలా ఇప్ప‌టికే ప్ర‌కాశం జిల్లాకు నాలుగు నెల‌ల్లో ముగ్గురు ఇన్‌చార్జ్ మంత్రులు వ‌చ్చారు. ఈ మేరకు సీఎస్ ఎల్వీ సుబ్రమణ్యం పేరుతో ఉత్తర్వులు వచ్చాయి. మొత్తానికి ఇన్ చార్జి మంత్రుల విషయంలో జ‌గ‌న్ ఎందుకో ?  ముందు నుంచి పెద్ద గంద‌ర‌గోళంలో ఉన్న‌ట్టే క‌నిపిస్తోంది. కొన్ని చోట్లా ఆయా జిల్లాల‌కు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేల మ‌ధ్య వివాదాల‌ను కొంద‌రు ఇన్‌చార్జ్ మంత్రులు ప‌రిష్క‌రించ‌లేక చేతులు ఎత్తేయ‌డంతో జ‌గ‌న్ వాళ్ల‌ను మార్చేస్తున్నారు.

ఇక తాజాగా జ‌రిగిన కేబినెట్ స‌మావేశంలో సైతం ఎవ‌రైతే ఇన్‌చార్జ్ మంత్రులు స‌క్ర‌మంగా ప‌నిచేయ‌రో.. ఆయా జిల్లాల్లో పార్టీని బ‌లోపేతం చేసేందుకు బాధ్య‌త తీసుకోరో…. అలాగే మంత్రులు, ఎమ్మెల్యేల మ‌ధ్య స‌ఖ్య‌త కుద‌ర్చ‌లేరో ?  వారి విష‌యంలో చాలా సీరియ‌స్ యాక్ష‌న్ ఉంటుంద‌ని చెప్ప‌డంతో మంత్రులు కూడా కాస్త టెన్ష‌న్ టెన్ష‌న్‌గానే ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news