కమలా పండ్లు నిమ్మ జాతికి చెందినవి. ఈ పండ్లు తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. కనుక ఈ పండ్లు అన్ని విధాల ఆరోగ్యకరమైనవి అని చెప్పవచ్చు. శీతాకాలంలో ఈ పండ్లు ఎక్కువగా దొరుకుతాయి.
కమలా పండ్లు తినడం వల్ల కలిగే ప్రయోజనాలు :
కమలా పండు లో చాలా తక్కువ కేలరీలు ఉంటాయి. అందువల్ల డైట్ లో ఉన్నవారు కూడా ఈ పండ్లను తీసుకోవచ్చు.
ఈ పండ్లు తినడం వల్ల జీర్ణవ్యవస్థ బాగుపడుతుంది. ఎందుకంటే కమలా పండ్లు తింటే జీర్ణశక్తి పెరిగి, ఆకలి పెరుగుతుంది మరియు కమలా పండ్లు తేలికగా జీర్ణం అయిపోతాయి. కాబట్టి ఎవరైనా సరే ఈ పండ్ల ను తినవచ్చు శక్తిని పొందవచ్చు.
జీర్ణశక్తిని పెంచడమే కాదు మలబద్ధకాన్ని కూడా పోగొడుతుంది. కాబట్టి శరీరంలో ఉన్న విష పదార్థాలు తొలగిపోతాయి. అంతేకాక విష పదార్థాలు పేరుకు పోకుండా కూడా సహాయ పడుతుంది.
నిమ్మజాతి పండ్ల లో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది అనే విషయం తెలిసినదే. విటమిన్ సి డెఫిషియన్సీ ఉన్నవారు ఈ పండును తరచుగా తప్పక తినండి.
జ్వరం తో బాధ పడేవారు కూడా ఎటువంటి సందేహం లేకుండా తినవచ్చు. ఎందుకంటే ఇవి తేలికగా జీర్ణమై శక్తినిస్తాయి, ముఖ్యంగా జలుబు చేయకుండా రక్షిస్తాయి.
అందమైన మరియు ఆరోగ్యకరమైన చర్మం పొందాలనుకుంటే కమలాపండు తొక్కలను ఎండబెట్టి పొడి చేసుకుని, ఆ పొడిని సున్నిపిండిలో కలుపుకుని సబ్బుకు బదులుగా వాడవచ్చు.
కమలా పండు తొక్కలు చర్మ ఆరోగ్యానికి ఎంతో సాయపడతాయి. మొటిమలతో బాధ పడుతున్న వారు కమలాపండు తొక్కలను నూరి మొటిమలు పై రాస్తే మొటిమలు తగ్గుతాయి.