వావ్…! సపోటా వల్ల ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలా..?

-

తియ్యగా ఉండే ఈ సపోటా పండుని అందరూ తినడానికి ఇష్టపడుతుంటారు. అద్భుతమైన వైద్య గుణగణాలు కలిగి ఉండటం విశేషం. సపోటా లో అధిక క్యాలరీలు ఉంటాయి. దీనినే నోస్ బెర్రీ అని కూడా పిలుస్తారు. దీనిలో ఉండే గుజ్జు వల్ల తేలికగా జీర్ణం అయిపోతుంది కూడా. పిల్లలకు జ్యూస్, మిల్క్ షేక్ చేసి పెడితే ఎంతో ఇష్టంగా తీసుకుంటారు. రుచి మాత్రమే కాదు దీని వల్ల ఆరోగ్య ప్రయోజనాలు కూడా అనేకం ఉన్నాయి. మరి వాటి గురించి ఇప్పుడే చూసేయండి.

సపోటా లో పిండిపదార్ధాలు పుష్కలంగా ఉంటాయి. అలాగే శరీరానికి ఇచ్చే గ్లూకోస్ కూడా దీనిలో ఉంటుంది. సపోటా లో విటమిన్- ఈ కలిగి ఉండడం వల్ల కంటిచూపును మెరుగు పరుస్తుంది. అందువల్ల మంచి దృష్టిని పొందడానికి మీరు సపోటా పండు తప్పకుండా తీసుకోండి. డయాబెటిస్, గుండె సమస్యలు తో బాధపడే వారు తప్పకుండా వైద్యులను సంప్రదించిన తర్వాతే సపోటా పండ్లు తీసుకోవాలి. దీనిలో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు అధికంగా ఉన్నాయి. పేగు శోధము, చికాకుపెట్టే పేగు వ్యాధి, పొట్టలో పుండ్లు వంటి వ్యాధుల నుండి ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి సహాయపడుతుంది సపోటా.

సపోటా పండు వల్ల మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఒత్తిడి తగ్గించడంలో సపోటా ప్రధాన పాత్ర పోషిస్తుంది. అంతే కాదండి నిద్రలేమి, ఆందోళన కూడా ఇట్టే తరిమికొట్టేస్తుంది సపోటా. అధిక బరువు ఉన్నవాళ్లు సపోట తీసుకుంటే బరువు తగ్గవచ్చు. చర్మం కాంతివంతంగా ఉండడానికి కూడా సపోటా మంచి పాత్ర పోషిస్తుంది. జుట్టును మృదువుగా చేయడానికి మంచి సహాయం చేస్తుంది. అలానే జుట్టు రాలడానికి కూడా మంచి చికిత్స తీసుకోవచ్చు. సపోటా లోని ఉన్న ఫైబర్స్ మలబద్ధకం సమస్యలను దూరం చేస్తాయి. గర్భిణీలకు పాలిచ్చే తల్లులకు సపోటా బాగా మేలు చేస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news