ఈ పద్ధతిని అనుసరిస్తే మరింత నిగారింపు మీ సొంతం..!

-

ప్రతి ఒక్కరూ చర్మ సౌందర్యాన్ని పెంపొందించుకోవాలనుకుంటారు. మరీ ముఖ్యంగా ఆడవాళ్ళు చర్మ సౌందర్యంపై కొంచెం శ్రద్ధ వహిస్తూ ఉంటారు. ఎన్నో చిట్కాలు పాటించినా ఫలించలేదా…? అయితే తప్పకుండా దీని కోసం తెలుసుకుని తీరాలి. మరి ఆలస్యం ఎందుకు పూర్తిగా చూసేయండి. చర్మ సౌందర్యాన్ని పెంపొందించుకోవడానికి పసుపు బాగా పని చేస్తుంది.

 

fairness skin
fairness skin

పసుపు అందంలోనూ, ఆరోగ్యంలోను మంచి ఫలితాన్ని ఇస్తుంది. చర్మాన్ని శుభ్రపరచి సక్రమ రీతి లో పోషించడానికి పసుపు ప్రధాన పాత్ర పోషిస్తుంది. సున్ని పిండి తో పాటు పసుపు కలిపి స్నానానికి వాడితే మంచి ప్రయోజనం ఉంటుంది. అంతే కాదు బాదం నూనె, మీగడ, తేనెను పసుపు తో కలిపి ఒంటికి రాసుకుని స్నానం చేస్తే సౌందర్యం ఇనుమడిస్తుంది. పసుపు, వేపాకు చిగుళ్ళు దిరిసెన పట్టచూర్ణం సమాన భాగాలుగా తీసుకుంటే దీర్ఘ కాలంగా ఉన్న వ్రణాలను శుభ్రంగా కడిగి పట్టు వేస్తే వ్రణాలు తగ్గిపోతాయి.

చర్మ వ్యాధులు కూడా పూర్తిగా తగ్గిపోతాయి. ప్రతి రోజూ ఉదయం స్నానం చేయటానికి అరగంట ముందు పసుపు ఒంటికి బాగా పట్టించి తర్వాత మీరు స్నానం చేస్తే ఆరోగ్యాన్ని మాత్రమే కాదు శరీర లావణ్యాన్ని కూడా మీరు పెంచుకోవచ్చు. పింపుల్స్ తగ్గిపోవాలంటే పసుపు, చందనం పొడి రోజ్ వాటర్ తో కలిపి పేస్ట్ లాగ చేసి ముఖానికి పూసి కొంత సేపటి తర్వాత కడిగేస్తే మీకు పింపుల్స్ తగ్గి నిగారింపు కలుగుతుంది. నిమ్మరసం కీరాలను కొద్దిగా పసుపు తో కలిపి రాసుకున్నట్లు అయితే ఎండ తీవ్రత వల్ల నల్లబారిన చర్మం తిరిగి కాంతివంతంగా తయారవుతుంది. ఆయుర్వేదిక్ గుణాలు ఉన్న పసుపుని ఇలా మీరు కనుక ఉపయోగిస్తే అనేక చర్మ సమస్యల నుంచి బయట పడవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news