ఆ పథకంతో అన్ని రాష్ట్రాల్లో వైద్యం..?

-

‘ ఆయుష్మాన్‌’ భారత్‌ పథకం ద్వారా మనం వేరే రాష్ట్రాల్లోనూ వైద్యం చేసుకోవచ్చు. దేశంలోని వివిధ రాష్ట్ర్రా ప్రజలు ఇక్కడికొచ్చి కూడా వైద్యం చేసుకునేందుకు వెసులుబాటు కలగనుంది. ఆయుష్మాన్‌ భారత్‌ పథకాన్ని తెలంగాణలో అమలు చేసేలా చర్యలు తీసుకుంటున్నట్లు ఇటీవలప్రభుత్వం ప్రకటించిన సంగతి విదితేమే. ఈ క్రమంలో రాష్ట్రంలోని కొనసాగుతున్న ఆరోగ్యశ్రీతో ఆయుష్మాన్‌ పథకాన్ని అనుసంధానం చేసేందుకు ప్రత్యేక ప్రణాళికలను రూపొందించనున్నారు. రాష్ట్రంలో ఆయుష్మాన్‌ పథకం అమలైనా ఆరోగ్యశ్రీ పథకం కూడా దానితో అనుసంధానంగా కొనసాగే అవకాశం ఉంటుంది.

400 కొత్త రోగాలకు చికిత్స..

రాష్ట్రంలో 77.19 లక్షల కుటుంబాలు ఆరోగ్యశ్రీ పథకానికి అర్హులుండగా, ఆయుష్మాన్‌ పథకంలోకి కేవలం 26.11 లక్షల కుటుంబామే అర్హులవుతారని వైద్యశాఖ తెలిపింది, అయితే, ఆరోగ్యశ్రీ పరిధిలో లేని 400ల వివిధ రకాల చికిత్సలు ఆయుష్మాన్‌ భారత్‌ అమలుతో అందుబాటులోకి రానున్నాయి. ప్రస్తుతం ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ఒక్కో కుటుంబానికి ఏడాదికి .2 లక్షలు పరిమితి ఉండగా, కొన్ని చికిత్సలకు రూ.18 లక్షల కూడా భరిస్తుంది.

రూ. 5 లక్షల వరకు..

ఇక ఆయుష్మాన్‌ భారత్‌ అమలైతే 1,350 రకాల చికిత్సలు అందుబాటులోకి వస్తాయి. ప్రతి కుటుంబానికి రూ. 5 లక్షల వరకూ కేంద్ర ప్రభుత్వం ఖర్చు చేయనుంది. గతంలో ఆరోగ్యశ్రీలో లేని పలు రకాల వైద్యసేవలు ఆయుష్మాన్‌ భారత్‌ ద్వారా అందుబాటులోకి రానున్నాయి. ఈ పథకంలో కరోనా చికిత్స కూడా చేరుస్తుండటంతో ప్రజలకు కొంతమేరకు ఊరటగా కలగనునంది. ఆయుష్మాన్‌ భారత్‌ పథకం, రాష్ట్రంలో అమలైతే వివిధ వైద్యఖర్చుల కోసం దాదాపు రూ. 250 కోట్ల నిధులు విడుదలయ్యే అవకాశం ఉంటుందని సంబంధిత అ«ధికార యంత్రాంగం చెబుతోంది. ఆయుష్మాన్‌ భారత్‌లో చాలా ప్యాకేజీలు ఉన్నాయని దీంతో ప్యాకేజీల ధరలు పెంచాలని ప్రైవేట్‌ ఆస్పత్రుల యాజమాన్యం డిమాండ్‌ చేస్తుంది. ఒక వేళ ప్యాకేజీల ధరలు పెంచకుంటే వైద్యం చేయడం అసాధ్యమని పరోక్ష్యంగా హెచ్చరిస్తున్నాయి. ఆరోగ్యశ్రీ ప్యాకేజీలను పెంచాలన్న డిమాండ్‌ పారంభం నుంచే ఉంది. అయితే.. ఆరోగ్యశ్రీ ధరలను యాథావిధిగా ఉండి ఆయుష్మాన్‌ భారత్‌ ధరలను పర్తింపజేయాలనే రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ భావిస్తున్నట్లు సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news