షుగ‌ర్ ఉందా..? తియ్యగా తినాలనుకుంటే వీటిని తీసుకోండి…!

-

తీపి అంటే ఇష్టం ఉండ‌ని వారెవ‌రుంటారు. పండుగ‌లు ప‌బ్బాలు, పుట్టిన‌రోజులు ఇలా ప్ర‌త్యేక‌త ఏదైనా తీపి ప‌దార్ధాలు ఉండాల్సిందే.. అయితే నిజానికి తియ్యగా ఉండేవి తినడం వల్ల ఇబ్బందులు పడాల్సి వస్తుంది. పంటి సమస్యలు మొదలు షుగర్ లెవెల్స్ పెరిగిపోవడం వరకు చాలా సమస్యలు వస్తాయి.

ఎక్కువ పంచదారను తీసుకోవడం వల్ల డయాబెటిస్, బరువు పెరిగిపోవడం మొదలైన ఇబ్బందులు కూడా తలెత్తుతాయి. అయితే మీకు తీయగా తినాలి అనిపించినప్పుడు స్వీట్ వంటి వాటికి బదులుగా ఈ ఆహార పదార్థాలను తీసుకోండి. వీటి వల్ల ఎటువంటి నష్టం లేదు. అలాగే ఆరోగ్యం కూడా బాగుంటుంది. అయితే మరి ఆలస్యమెందుకు ఆ ఆహార పదార్థాలు గురించి చూద్దాం.

అరటి పండ్లు :

అరటి పండ్లు తియ్యగా ఉంటాయి. వీటి వల్ల ఇబ్బందులు ఉండవు. పోషక పదార్ధాలు సమృద్ధిగా ఉంటాయి. షుగర్ లెవెల్స్ ను అరటిపండు పెంచదు.

చిలకడ దుంప :

చిలకడదుంప కూడా తియ్యగా ఉంటుంది. మీరు దాన్ని ఉడికించుకుని తీసుకోవచ్చు లేదా బేక్ చేసుకు తీసుకోవచ్చు. అయితే తియ్యగా ఉంటాయి కాబట్టి ఇబ్బంది రాదు. ఏమైనా తియ్యగా తినాలని అనిపిస్తే వీటిని కూడా ప్రిఫర్ చేయండి. వీటి వల్ల ఆరోగ్యానికి మంచిదే కానీ నష్టం ఉండదు. పొటాషియం, ఐరన్, విటమిన్స్ కూడా ఇందులో ఎక్కువగా ఉంటాయి.

డార్క్ చాక్లెట్ :

డార్క్ చాక్లెట్ కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో మెగ్నీషియం, ఫైబర్, విటమిన్స్ ఉంటాయి. అయితే డార్క్ చాక్లెట్ లో 70 శాతం కంటే ఎక్కువ కోకో లేకుండా చూసుకోండి.

ఖర్జూరం :

ఇవి కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. తియ్యగా ఏమైనా తినాలనిపిస్తే ఖర్జూరం తీసుకోండి. పొటాషియం, ఐరన్ కూడా ఇందులో ఎక్కువగా ఉంటాయి. క్యాలరీలు కూడా ఎక్కువగా ఉంటాయి. పోషక పదార్ధాలు కూడా సమృద్ధిగా ఉంటాయి. కాబట్టి ఖర్జూరం కూడా తీసుకోవచ్చు. ఇలా మీకు తియ్యగా ఏమైనా తినాలని అనిపించినప్పుడు వీటిని తీసుకుంటే అనారోగ్య సమస్యలు రావు పైగా ఆరోగ్యానికి మంచిది.

Read more RELATED
Recommended to you

Exit mobile version