IPL Auction : వేలం నిర్వ‌హ‌కుడికి కార్డిక్ అరెష్టు.. వేలం వాయిదా.!

-

ఐపీఎల్ వేలం రెండు రోజుల పాటు నిర్వ‌హించ‌నున్న విష‌యం తెలిసిందే. అయితే ఇవాళ ఉద‌యం నుంచి మ‌ధ్యాహ్నం వ‌ర‌కు వేలం నిర్వ‌హించారు. ఈ వేలం నిర్వ‌హిస్తున్న త‌రుణంలోనే ఐపీఎల్ వేలం నిర్వాహ‌కుడు ఉన్న‌ట్టుండి అక‌స్మాత్తుగా హ్యు డ‌యాస్ వ‌ద్ద కుప్ప‌కూలిపోయాడు. దీంతో వేలంలో అనుకోని ప‌రిణామం చోటు చేసుకోవ‌డంతో వేలాన్ని వాయిదా వేశారు.

వేలం మ‌ధ్య‌లో మెడిక‌ల్ ఎమ‌ర్జెన్సీ ఏర్ప‌డింది. అక‌స్మాత్తుగా వేలం బాధ్య‌త‌ను నిర్వ‌హిస్తున్న హ్యూ ఎడ్మిడ్స్ శ్రీలంక ఆల్‌రౌండర్ హసరంగా రూ.10.75 కోట్లతో వేలంలో ఉన్నాడు. వ‌నింద్ హ‌సరంగాపై వేలం పాట మ‌ధ్య స్పృహ త‌ప్పి ప‌డిపోయాడు. అత‌ను ఆట‌గాళ్లంద‌రిపై బిడ్లు నిర్వ‌హించే స‌మ‌యంలో ఒక్క‌సారిగా నేల‌పై కుప్ప‌కూలిపోవ‌డంతో వేలాన్ని ప్ర‌స్తుతం నిలిపేశారు. ఈ ఘటనతో ఐపీఎల్ వేలంలో పాల్గొంటున్న వివిధ ఫ్రాంచైజీలకు చెందిన వ్యక్తులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఈ ఘటన కారణంగా టీవీ ఛానళ్లలో లైవ్ ప్రసారం కూడా ఆపేశారు.

Read more RELATED
Recommended to you

Latest news