గార్లిక్ మిల్క్‌తో కాళ్లనొప్పి, వెన్నునొప్పి అన్నింటిని నయం చేసుకోవచ్చు తెలుసా..!

-

వంటల్లో తరచుగా వాడే వెల్లుల్లిలో ఎన్నో ఆరోగ్యప్రయోజనాలు ఉన్నాయి..అయితే మనందరికి వెల్లులితో పేస్ట్ చేయడం, పచ్చడి చేయడం వరకే తెలుసు..వెల్లుల్లి పాలతో కూడా ఎన్నో పోషకాలు ఉన్నాయంటున్నారు నిపుణులు.ఇది పెయిన్ కిల్లర్ లా పనిచేస్తుందట. సయాటికా, అర్థరైటీస్ వంటి నొప్పుల జబ్బులకు చెక్ పెట్టొచ్చు.
జీర్ణసంబంధిత వ్యాధులను తగ్గించి మలబద్ధకాన్ని తగ్గించే గుణం వెల్లుల్లి పాలకు ఉంది..యాసిడిటీ, గ్యాస్, అజీర్తికి ఇది మంచి మందు. వెల్లల్లిలో యాంటీ సెప్టిక్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఇది శరీరంలో నుంచి టాక్సిన్స్ తొలగించి ఇమ్యూనిటీని పెంచుతుంది.
ఈ పాలు వెన్నునొప్పి, లోయర్ బ్యాక్ పెయిన్, బుటాక్స్, కాళ్లనొప్పితో బాధపడేవారికి అమృతమనే చెప్పాలి. ఇది సయాటికాతో బాధపడేవారికి కూడా మంచి రెమిడీ. ఇవి మాత్రమే కాదు. ఈ వెల్లల్లి పాలతో దగ్గు, అస్తమా, టీబీ, నిమోనియా, కొలెస్టరాల్ కి మంచి మందు.
ఈ పాలు ప్రతిరోజూ తాగడం వల్ల మగఆడ ఇద్దరిలో సంతాన సమస్యలకు మంచి మందుగా పనిచేస్తుంది. అంతేకాదు, మీకు నిద్ర
పట్టక బాధపడుతుంటే..సగం కప్పు ఈ వెల్లుల్లి పాలు రోజు రాత్రి వారంపాటు తాగితే మంచి ఫలితం ఉంటుంది.

గార్లిక్ మిల్క్ తయారీ విధానం..

ఒక ప్యాన్ తీసుకుని ముందుగా పాలు వేడి చేయాలి. దీంట్లో 3-4 వెల్లల్లి రెబ్బలు వేసుకోవాలి. ఇప్పుడు పాలు మరిగాక, కొద్దిగా మిరియాల పొడి, 1/2 టీస్పూన్స్ పసుపు వేసి బాగా కలపాలి. పాలు ఒక పొంగు వచ్చాక స్టవ్ కట్యేయండి. పాలు గోరువెచ్చగా ఉన్నప్పుడు ఒక కప్ లోకి తీసుకుని అందులో 1/2 టీస్పూన్స్ తేనెను జత చేసి తీసుకోవాలి. అంతే వెల్లుల్లి పాలు రెడీ.
ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి..ముఖ్యంగా..కీళ్లనొప్పులతో ఈరోజుల్లో చాలా మంది బాధపడుతున్నారు..అలాంటి వారందరికి ఈ వెల్లుల్లి పాలు అద్భుతంగా పనిచేస్తాయని ఆయుర్వేద వైద్యులు చెప్తున్నారు..మీ ఇంట్లో కూడా ఎవరైనా ఇలాంటి నొప్పులతో బాధపడుతుంటే..ఓ సారి ఈ వెల్లుల్లి పాలు ట్రై చేయండి. అయితే అన్నీ అందరికి పడాలని లేదు..ఈ వాడకం మొద్దలుపెట్టాక మీకు ఏదైనా..సైడ్ ఎఫెక్ట్స్ వస్తే వైద్యులను సంప్రదించటం మంచిది.
-Triveni Buskarowthu

Read more RELATED
Recommended to you

Latest news