ఈ తప్పులు చేయడం వలనే గుండె సమస్యలు…జాగ్రత్త సుమా..!

-

ఎక్కువ మంది ఈ మధ్య కాలం లో హృదయ సంబంధిత సమస్యలని ఎదుర్కొంటున్నారు ముఖ్యంగా చిన్న వయసు వాళ్ళు కూడా గుండె జబ్బులతో బాధ పడుతున్నారు హార్ట్ ఎటాక్ వంటి వాటిని ఎదుర్కోవాల్సి వస్తుంది. అది కూడా చిన్న వయస్సులోనే. మారిన జీవనశైలి కారణంగా ఇటువంటి ఇబ్బందుల్ని ఎదుర్కోవాల్సి వస్తుంది యువత ఆకస్మాత్తుగా గుండెపోటుకి గురవుతున్నారు.

గుండెపోటు సమస్యలు రాకూడదంటే ఈ సూత్రాలని తప్పనిసరిగా పాటించాలి అప్పుడు ఆరోగ్యంగా ఉండొచ్చు హృదయ ఆరోగ్యం కూడా బాగుంటుంది మరి ఇక ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాన్ని చూద్దాం.

ఈ ఆహార పదార్థాలను అస్సలు తీసుకోకండి:

వేయించిన ఆహార పదార్థాలు, ఫాస్ట్ ఫుడ్, మైదా, పంచదార వంటి వాటికి దూరంగా ఉండాలి ఇటువంటి వాటిని తీసుకోవడం వలన రక్తంలో కొవ్వు శాతం పెరుగుతుంది. రక్తం సరఫరాల్లో అవాంతరాలు కలుగుతాయి దీనితో గుండెపోటు వచ్చే ప్రమాదం ఉంది.

సరైన బరువు:

సరైన బరువును మెయింటైన్ చేయడం చాలా ముఖ్యం బరువు కారణంగా గుండెపోటు రావచ్చు. ఎక్కువ బరువు ఉండడం వలన రక్తం సరఫరా చేసేందుకు గుండెకు భారం కలుగుతుంది దీంతో గుండెపోటు వచ్చే ప్రమాదం ఉంది.

వ్యాయామం లేకపోవడం:

వ్యాయామం చేయకపోవడం వలన కూడా ఈ సమస్యలు కలుగుతాయి వ్యాయామం చేస్తే ఆరోగ్యంగా ఉండొచ్చు. అలానే రక్తపోటు స్థాయిలని తగ్గించుకోవచ్చు.

ధూమపానం:

గుండె పోటుకి ధూమపానం కూడా కారణం అవుతుంది చెడు కొలెస్ట్రాల్ దీనివలన పెరుగుతుంది దీనితో గుండె ఆరోగ్యం పాడవుతుంది కనుక ధూమపానానికి దూరంగా ఉండడం మంచిది.

ఆరోగ్యకరమైన పండ్లు:

ఆరోగ్యకరమైన పండ్లను కూరగాయలని డైట్ లో చేర్చుకోండి. విటమిన్స్ మినరల్స్ వంటివి పుష్కలంగా లభిస్తాయి. గుండె ఆరోగ్యంగా ఉంటుంది. సమస్యలు ఉండవు.

ఉప్పును తగ్గించండి:

గుండె ఆరోగ్యంగా ఉండాలంటే ఉప్పు తగ్గించుకోవడం మంచిది తక్కువ ఉప్పు తీసుకుంటే రక్త పోటు స్థిరంగా ఉంటుంది. మీ ఆరోగ్యం గురించి ఏమైనా సమస్యలు ఉంటే డాక్టర్ని కన్సల్ట్ చేయండి రెగ్యులర్ గా చెక్ అప్ చేయించుకుంటే సమస్య ఏమైనా ఉంటే తెలుస్తుంది. అలానే ఒత్తిడి వలన కూడా గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఉంది ఒత్తిడి లేకుండా ఆనందంగా జీవించండి.

Read more RELATED
Recommended to you

Exit mobile version