ఆధార్‌ కార్డులో ఏయే వివరాలు ఎన్నిసార్లు మార్చవచ్చు అంటే…!

-

మనకి వుండే ముఖ్యమైన డాక్యుమెంట్స్ లో ఆధార్ కార్డు కూడా ఒకటి. ఆధార్ వలన ఎన్నో లాభాలు వున్నాయి. చాలా మంది ఆధార్‌ కార్డు లోని వివరాలు తప్పుగా ఉంటాయి. వాటిని సరి చేసుకోవడం ఎంతో ముఖ్యము. ఆధార్‌ లో తప్పులు ఉండటం కారణంగా సమస్యలు వస్తుంటాయి. కాబట్టి ఏ తప్పులు లేకుండా చూసుకోండి. ఒకవేళ కనుక తప్పులు ఉంటే వాటిని కరెక్ట్ చేసుకోండి.

అప్పుడు సమస్యే ఉండదు. ఆధార్‌ కార్డు జారీ చేసే సంస్థ యూఐడీఏఐ ఆధార్‌లోని పేరు, పుట్టిన తేదీ, చిరునామా మొదలైనవి మనం మార్చవచ్చు. అయితే ముఖ్య విషయం ఏంటంటే కార్డు లో ప్రతి సమాచారాన్ని అన్ని సార్లు కూడా మార్చేందుకు కుదరదు. కొన్ని వివరాలని కొన్ని సార్లే మార్చేందుకు అవుతుంది. బయోమెట్రిక్‌ వివరాలు ఉంటాయి కాబట్టే ఆధార్‌ కార్డులు ఇతర పత్రాలకంటే కాస్త భిన్నంగా ఉంటాయి.

ఆధార్ కార్డులో, పేరులో తప్పులు ఉంటే పదే పదే మార్చేందుకు కుదరదు. కేవలం రెండు సార్లు మాత్రమే దాన్ని మార్చడానికి అవుతుంది. ఒకవేళ కనుక ఏదైనా పొరపాటు వున్నా లేదా వివాహం తర్వాత మహిళలు ఇంటి పేరును మార్చుకోవాలనుకుంటే వారు అలా చేయవచ్చు. ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్ మోడ్‌లో మార్చేందుకు అవుతుంది.

జెండర్ ని అయితే కేవలం ఒకసారి మార్చడానికి అవుతుంది. జెండర్ ని ఎక్కువ సార్లు మార్చడానికి అవ్వదు ఒక్కసారే.

ఇక పుట్టిన తేదీని అయితే ఒక్కసారి మాత్రమే మార్చడానికి అవకాశం ఉంటుంది. అంత కంటే ఎక్కువ సార్లు కుదరదు.

ఆధార్‌ లోని కొన్ని వివరాలు ఎన్ని సార్లు అయినా మార్చచ్చు. ఇంటి చిరునామా, ఇమెయిల్‌ ఐడి, ఫోన్‌ నంబర్‌, ఫోటో, వేలిముద్రలు ఎన్ని సార్లైనా మార్చచ్చు. అలానే ఐ స్కాన్‌ వంటివి కూడా ఎన్ని సార్లు అయినా మార్చుకోవచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version