ఏటీఎం లావాదేవీలు ఫెయిల్ అయితే ఎంత ఫైన్ పడుతుందంటే…?

-

బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయడం డబ్బులు విత్డ్రా చేసుకోవడం దీని కోసం ఏటీఎం మిషన్ ని ఉపయోగించడం మనమందరం చేస్తున్నదే. అయితే చాలా మంది ఏటీఎం బ్యాంకింగ్ చేసేస్తూ ఉంటారు. కానీ ఖాతాలో డబ్బులు లేక పోవడాన్ని గమనించరు.

ATM
ATM

ఒక ఉదాహరణ చూస్తే ఒకవేళ మీ దగ్గర 3000 రూపాయలు ఉంటే విత్డ్రా చేసినప్పుడు మర్చిపోయి 3500 విత్ డ్రా చేయడానికి మీరు సిస్టం లో ఎంటర్ చేస్తే… ఆ ట్రాన్సాక్షన్ ఫెయిల్ అవుతుంది. ఒకవేళ కనుక మీ ఖాతాలో అంత ఎక్కువ డబ్బులు లేకపోతే ఛార్జీలు బ్యాంకు తీసుకుంటుంది.

అయితే ఒక ట్రాన్సాక్షన్ కి రూపాయలు 20 నుంచి 25 రూపాయలు మీ ఖాతా నుంచి తొలగిస్తారు. డిసెంబర్ 2020 నుంచి ఈ రూల్ వచ్చింది. మీ ట్రాన్సాక్షన్ కనుక ఫెయిల్ అయితే మీరు డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. కాబట్టి విత్డ్రా చేసినప్పుడు ముందు మీ బ్యాంక్ అకౌంట్ లో ఎంత డబ్బులు ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి. అయితే ట్రాన్సాక్షన్ ఫెయిల్ అయితే ఒక్కో బ్యాంకు ఒక్కోలా ఛార్జి చేస్తుంది.

ఎస్బీఐ కస్టమర్లకి ఎంత ఛార్జ్ చేస్తుందంటే…?

దేశీయ దిగ్గజ బ్యాంక్ ఎస్బీఐ ట్రాన్సాక్షన్ ఫెయిల్ అయితే 20 రూపాయలు వసూలు చేస్తుంది.
ఇన్సఫిషియంట్ బ్యాలెన్స్ ఉండడం వల్ల ఈ చార్జీలు కట్టాల్సి ఉంటుంది. దీనితో పాటు వేరేగా జిఎస్టి ఉంటుంది. హెచ్డీఎఫ్సి బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, కోటక్ మహేంద్ర బ్యాంక్, మరియు ఐసిఐసిఐ బ్యాంక్ కూడా అకౌంట్ లో తక్కువ బ్యాలెన్స్ ఉంటే డబ్బులు వసూలు చేస్తున్నాయి.

ఇక హెచ్డిఎఫ్సి బ్యాంకు ఎంత వసూలు చేస్తుంది అంటే..?

ట్రాన్సాక్షన్ కనుక ఫెయిల్ అయితే హెచ్డీఎఫ్సి కస్టమర్లు 25 రూపాయలు చెల్లించాలి. కోటక్ మహేంద్ర బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, ఎస్ బ్యాంక్, కోటక్ మహేంద్ర బ్యాంక్ ఖాతాదారులకు అయితే రూ 25 కట్టాల్సి ఉంటుంది. ఇన్సఫిషియంట్ బ్యాలెన్స్ వల్ల ట్రాన్సాక్షన్ ఫెయిల్ అయితే ఎస్ బ్యాంక్ వాళ్ళు కూడా రూపాయలు 25 కట్టాలి. యాక్సిస్ బ్యాంక్ కూడా రూపాయలు 25 చెల్లించాలి.

ఒకవేళ ఈ ఫైన్ కట్టకుండా ఉండాలంటే ఏం చేయాలి…?

ఈ ఫైన్ కట్టకుండా ఉండాలంటే మీరు ముందుగా మీ అకౌంట్ లో ఎంత డబ్బులు ఉన్నాయని చెక్ చేసుకోవాలి. చాలా బ్యాంకులు మరియు ఫోన్ కాల్స్ ద్వారా చెక్ చేసుకునే ఫెసిలిటీ కల్పించాయి. ఈ ఫెసిలిటీ ని మీరు ఉపయోగించి ముందుగా బ్యాలెన్స్ ని చెక్ చేసుకోవచ్చు.

ఇతర బ్యాంక్ ఎటిఎం లో చెక్ చేస్తే మీకు చార్జ్ పడుతుంది. ముందు ఐదు నుంచి ఎనిమిది ట్రాన్సాక్షన్స్ కి ఫ్రీగా బ్యాలెన్స్ చెక్ చేసుకోవచ్చు. ఆ తర్వాత కూడా మీరు చెక్ చేసుకోవాలంటే ఈ ఫెసిలిటీని మీరు ఉపయోగించవద్దు. వేరే బ్యాంకు ఏటీఎంలో మీరు చెక్ చేసుకుంటే మీకు ఫైన్ పడుతుంది. నాన్-ఫైనాన్సియల్ ట్రాన్సక్షన్స్ కి ఎస్బీఐ లో అయితే ఎనిమిది రూపాయలు ఛార్జ్ పడుతుంది. జీఎస్టీ కూడా పడుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news