అధిక బరువు, పొట్టతో బాధపడుతున్నారా..ఈ సలాడ్ ని నెల రోజులు తింటే చాలు తగ్గేయొచ్చు..!

-

ఇప్పుడంతా వర్క్ ఫ్రమ్ హోమ్ అయిపోయింది. ఇంట్లోనే ఉంటూ..నచ్చింది తింటూ..గాడిదచాకిరి చేయించుకుంటున్నారు. మనం కూడా తప్పక కొంచెం ఇష్టంగా కొంచెం కష్టంగా మొత్తానికి ఎలాగోలా ఏడాది నుంచి చేస్తూనే ఉన్నాం. ఇక ఆఫీసులకు పిలుస్తారు అనే టైంలో ఒమిక్రాన్ నేను ఉన్నాను అంటూ…ఎంట్రీ ఇచ్చింది. మళ్లీ యాజమాన్యం వెనకడుగు వేసింది. ఇలా ఇంటి నుంచే పనిచేయటం వల్ల ముందు నుంచే కాస్త లావుగా ఉన్నవాళ్లు ఇప్పుడు ఇంకా లావు అయిపోయారు.

బరువు 10-15కేజీలు ఎక్కువగా ఉన్న మార్బిడ్ ఒసిసిటీతో బాధపడుతున్నవారికి, పొట్ట ఎక్కువగా ఉన్నవారికి, కొవ్వు బాగా కరగాలనుకునేవారికి ప్రధానంగా మధ్యాహ్నం పూట తిన్న ఆహారమే ఈ సమస్యకు మూల కారణం. చాలామంది ఎంత డైటింగ్ చేసినా, చేస్తున్నా..మధ్యాహ్నం మాత్రం అన్నం తినడానికే ఇష్టపడతారు. పొద్దున్న, సాయంత్రం అయితే స్ప్రౌట్స్, ఫ్రూట్స్ తో సరిపెట్టుకుంటారు. ఇక మధ్యాహ్నం భోజనం అయ్యేసరికి..ఉప్పు, నూనెలు తక్కువగా ఉన్నాయి తినమంటే మనకు నచ్చుదు, అలా చేసిపెట్టేవాళ్లు లేకపోవచ్చు..ఇలా వివిధరకాల కారణాల వల్ల ఏదో ఒకటి తినేస్తారు.

మధ్యాహ్నం కూడా వెయిట్ బాగా తగ్గాలనుకునేవారికి, చాలా టేస్టీగా ఉండే బెస్ట్ లంచ్ ఒకటి ఉంది. మీరు దీన్ని తయారుచేసుకుని తిన్నారంటే..వెయిట్ జట్ స్పీడ్ లో తగ్గుతుంది. ఇంకెందుకు లేట్ అది ఎలా చేయాలో చూద్దాం.

కావలిసిన పదార్థాలు..

ఒక కప్పు స్వీట్ కార్న్ గింజలు
చిలకడదుంపు తురుము
కీరా దోసకాయ ముక్కులు
క్యారెట్ ముక్కలు
బీట్ రూట్ ముక్కలు
ఉల్లిపాయ ముక్కలు
గింజలు తీసేసిన టమాటాలు.
ఇవి అన్నీ చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి. రసాయనాలు లేకుండా క్యాబేజీ దొరికితే అది కూడా వాడుకోండి.

తయారుచేసే విధానం:

వీటన్నింటిని బౌల్ వేసి కలపండి. పైన మిరియాలపొడి చల్లండి. కారం బదులుగా ఇది. మీకు సరిపడా వేసుకోవాలి. ఒక స్పూన్ తేనె..దీనివల్ల తియ్యగా ఏం రాదు..ఉప్పులేని లోటు తెలుస్తుంది అంతే..కొద్దిగా జిలకర పొడి, నిమ్మరసం కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా చల్లుకొండి.

ఒక అరకేజీనుంచి, ముప్పావుకేజీవరకు చేసుకుని కడుపునిండా తినండి. ఈ సలాడ్ కి ఒట్టిగా తినలేమనుకుంటే..ఒక పెరుగుకప్పు తీసుకుని..అందులో కాస్త ఉల్లిపాయలు, పచ్చిమిర్చిముక్కలు, కీరాదోసకాయ ముక్కలు వేసుకుని కాస్త నిమ్మరసం వేసుకుని..దీన్ని ఈ సలాడ్ తో తింటే రైతాలా తినొచ్చు.

అరకేజీ, ముప్పావుకేజీ సలాడ్ తిన్నప్పటికీ మీకు 200 కేలరీలు కూడా రావు. కానీ మూడు నాలుగు గంటలు పొట్ట ఫుల్ గా ఉంటుంది. చెక్కర స్లోగా విడుదల అవుతుంది. కానీ విటమిన్స్, పోషకాలు, పీచు పదార్ధాలు మాత్రం సమృద్ధిగా ఉంటాయి. అంటే ఇందులో వాటర్ కంటెంట్ బాగా ఉంటుంది కాబట్టి ప్రేగులను బాగా క్లీన్ చేస్తుంది. మలపదార్థాలను గట్టిగా కాకుండా క్లీన్ అవడానికి, ప్రేగుల్లో గుడ్ బాక్టీరియా పెరుగుతుంది.

స్వీట్ కార్న్ 100 గ్రాములు తీసుకుంటే 84 కాలరీలు ఉన్నాయి. ఇక మిగతావి అన్నీ కాలరీస్ లేనివే. ఈ సలాడ్ కి కాని మధ్యాహ్నం తినటం అలవాటు చేసుకున్నారంటే..బొజ్జ ఈజీగా కరుగుతుంది. బరువు త్వరగా తగ్గుతారు. దీన్ని తయారుచేసుకోవాడనికి 10-15 నిమిషాలు టైం పడుతుంది అంతే. మగవాళ్లు కూడా కట్టింగ్ చేయటం నేర్చుకున్నారంటే..ఎవరి హెల్ప్ లేకుండా ఈజీగా తయారుచేసేసుకోవచ్చు.

ఇలా తయారుచేసుకుని తినటం అలావటు చేసుకుంటే..ఫ్యాటీలివర్ కూడా ఒబిసిటీతో పాటు తగ్గిపోతుంది. కొందరికి కొవ్వు గడ్డలు అవి కూడా తగ్గిపోతాయి. దీంతోపాటు ఎల్డీఎల్ ఇది అయితే స్పీడ్ గా తగ్గిపోతుంది. దీనివల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. వెయిట్ తగ్గటానికి ఇది చాలా మంచి డైట్. కడుపునిండా తిన్నా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. వండకుండా, హాస్టల్స్ లో ఉన్నా, రూంలో ఉన్నా, సింగిల్స్ గా ఉన్నా, ఒకరి అవసరం లేకుండా హ్యాపీగా చేసేసుకోవచ్చు. ముఖ్యంగా వర్క ఫ్రమ్ చేసుకునేవాళ్లు అయితే..ఎం చక్కా చేసుకుని తింటూ వర్క్ చేసుకోవచ్చు. అయితే ఇది స్టోర్ చేసుకుంటా అంటే కుదరదు. తయారు చేసిన 2 గంటల్లో వాడేయాలి. ఫ్రష్ గా తయారు చేసుకుని ఎప్పటికప్పుడు తిన్నారంటే..అనదికాలంలోనే వెయిట్ లాస్ అవ్వొచ్చు.

ఇంకా కొత్తిమీర బాగా ఇష్టపడేవారు ఎవరైనా ఉంటే..అంత కొత్తిమీర గ్రౌండ్ చేసి ఆ పేస్ట్ ని సలాడ్ లో కలుపుకున్నారంటే.. ఉప్పులేని లోటు అస్సలు తెలియకుండా..చాలా రుచిగా ఉంటుంది. ఒక నెల రోజులు, రెండు నెలలు అని టార్గెట్ పెట్టుకుని తిన్నారంటే..పొట్టకు ఎంత హాయిగా ఉంటుందో, నిద్రరాదు, బద్దకం ఉండదు. అంటే ఇన్నాళ్లు అన్నీ ఉడికినవి తిన్నాం కదా..ఇలా ఒక నెల రెండు నెలలు టార్గెట్ పెట్టుకుని తిని చూడండి.

ఇలాంటి ఆహారాలు తిన్నప్పుడు, బయట ఆహారంలో టెస్టీగా ఉండేవి తిని..వాటితో వీటిని కంపార్ చేసుకున్నప్పుడు..మీకు తేడా తెలుస్తుంది. ఈ సలాడ్ ని తినడం అలవాటుగా చేసుకున్నప్పుడు..మీలో వచ్చే మార్పులు మిమ్మల్ని బయట దొరికే ఆహారానికి దూరం చేస్తాయి. మానసికంగా, శారీరకంగా ఎంతో చక్కగా పనిచేస్తుంది.

మొదట్లో మనకు ఇది నచ్చకపోవచ్చు. ఇప్పటివరకూ ఉప్పు, కారాలు, ఆయిల్స్, మసాలాలు ఉన్న రుచికరమైన భోజనం చేసిన మనకు ఉన్నట్టు ఉండి ఇలాంటి తినమంటే శరీరం సహకరించదు. కానీ విల్ పవర్ గట్టిగా ఉంటే..బరువు తగ్గాలి, నాజూగ్గా ఉండాలని గట్టిగా అనుకుంటే సాధ్యం అవుతుంది. దృడ సంకల్పంతో తినటం అలవాటు చేసుకుంటే..మీలో వచ్చే మార్పేమిమ్మల్ని ఇంకాస్త తినేలా చేస్తుంది. బరువు పెరుగుతున్నాం అని తెలిసేలోపే చాలా పెరిగిపోతారు. ఎక్సర్ సైజ్ లు చేయమంటే టైం ఉండదు, ఇంట్రస్ట్ రాదు..ఇక ఎలా బరువుతగ్గేది..లోపలకి వెళ్లవాటిని కంట్రోల్ చేయడమే మార్గం. కాబట్టి ఇలాంటి పోషకాలు, తక్కువ కాలరీలు ఉన్నవాటిని పంపిస్తే..ప్రేగుల్లో క్లీనింగ్ బాగా జరిగి..కొలెస్ట్రాల్ త్వరగా కరిగిపోతుంది. ఈ సలాడ్ ని టార్గెట్ గా పెట్టుకుని తిని మీకు ఉన్న అధికబరువును, పొట్టను తగ్గించుకుంటారని ఆశిస్తున్నాం.

-Triveni Buskarowthu

Read more RELATED
Recommended to you

Latest news