బ్రేకింగ్: ఎస్పీ బాలు చికిత్స చేస్తున్న ఆస్పత్రి వద్ద భారీగా పోలీసులు

ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలు ఆరోగ్యం క్రమంగా విషమంగా మారుతుంది. ఆయన ఆరోగ్యం నిన్నటి నుంచి కూడా ఆందోళనకరంగానే ఉంది అని వైద్యులు పేర్కొన్నారు. ప్రస్తుతం ఆయన వెంటిలేటర్ మీద చికిత్స తీసుకుంటున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యానికి సంబంధించి ఇంకా ఎలాంటి ప్రకటన కూడా విడుదల చేయలేదు. అయితే… చెన్నై ఎంజీఎం ఆసుపత్రి వద్ద భారీగా మోహరించారు పోలిసులు.

ఎస్పీ బాలు ఆరోగ్య పరిస్థితి తీవ్ర విషమంతో ఆసుపత్రి వద్ద హై టెన్షన్ వాతావరణం నెలకొంది. ఎస్పీ బాలు నివాసం వద్ద వీధులన్నీ శుభ్రం చేసి, బ్లీచింగ్ చల్లారు కార్పొరేషన్ సిబ్బంది. పోలీసుల హడావిడి కూడా అక్కడ మొదలయింది. ఆసుపత్రి వద్దకి కుటుంబ సభ్యులు, బంధువులు చేరుకున్నారు. ఆయన కోలుకోవాలి అంటూ పలువురు పూజలు నిర్వహిస్తున్నారు.