వాళ్ళ క్యాస్ట్ కంటే మాదే ఎక్కువ.. డబ్బు కోసమే చంపేశారు !

కులాంతర వివాహం కావడంతోనే హేమంత్, అవంతి ప్రేమను ఆమె కుటుంబ సభ్యులు అంగీకరించలేదని హేమంత్ తండ్రి మురళి కృష్ణ అన్నారు. గతంలో పలుమార్లు బెదిరింపులకు పాల్పడితే పోలీసుల దగ్గర రాజీ కుదుర్చుకున్నామని, ఇలా హత్య చేస్తారని ఊహించలేదని ఆయన అన్నారు.

మీడియాతో మాట్లాడిన ఆయన కులాంతర వివాహం కావడంతో వాళ్లకి ఇష్టం లేదని అయితే అవంతికని కుటుంబ సభ్యులు వెళ్ళగొట్టారని తాము కూడా పెళ్ళికి ఒప్పుకోకపోతే ఎక్కడికి వెళ్తారని తాము ప్రేమ పెళ్లికి ఒప్పుకున్నామని అన్నారు. అత్యంత దారుణంగా నా కొడుకును హత్య చేశారన్న ఆయన నా కొడుకును హత్య చేసిన వారిని వదిలి పెట్టవద్దు కఠినంగా శిక్షించాలని అన్నారు. ఇక వాళ్ళ రెడ్డి కులం కంటే తమ వైశ్య కులం పెద్దదాన్న ఆయన తమకి డబ్బు లేదనే తన కొడుకుని చంపేశారని అన్నారు.