అక్టోబ‌ర్ 14న విడుద‌ల కానున్న వ‌న్‌ప్ల‌స్ 8టి 5జి స్మార్ట్‌ఫోన్

మొబైల్స్ త‌యారీ సంస్థ వ‌న్‌ప్ల‌స్ త‌న నూత‌న ఫ్లాగ్ షిప్ స్మార్ట్ ఫోన్ వ‌న్‌ప్ల‌స్ 8టి 5జిని అక్టోబ‌ర్ 14వ తేదీన భార‌త్‌లో విడుద‌ల చేయ‌నుంది. ఈ మేర‌కు వ‌న్‌ప్ల‌స్ ఈ విష‌యాన్ని అధికారికంగా ప్ర‌క‌టించింది. ఆ తేదీ రోజు రాత్రి 7.30 గంట‌ల‌కు ఈ ఫోన్‌ను విడుద‌ల చేయ‌నున్న‌ట్లు తెలిపింది. ప్ర‌తి ఏడాది లాగే వ‌న్‌ప్ల‌స్ ఈ సారి కూడా త‌న స్మార్ట్ ఫోన్ల‌కు టి-సిరీస్‌ను విడుద‌ల చేస్తోంది. ఇప్ప‌టికే వ‌న్‌ప్ల‌స్ 8, వ‌న్‌ప్ల‌స్ 8 ప్రొ ఫోన్లు విడుద‌ల కాగా అదే సిరీస్ టి-మోడ‌ల్ ఫోన్ కూడా త్వ‌ర‌లో విడుద‌ల కానుంది.

oneplus 8t 5g smart phone releasing on october 14th

వ‌న్‌ప్లస్ 8టి ఫోన్ లో.. 6.55 ఇంచుల ఫుల్ హెచ్‌డీ ప్ల‌స్ ఫ్లుయిడ్ అమోలెడ్ డిస్‌ప్లేను ఏర్పాటు చేసిన‌ట్లు తెలిసింది. దీనికి 120 హెడ్జ్ రిఫ్రెష్ రేట్ అందిస్తార‌ని స‌మాచారం. అలాగే ఈ ఫోన్‌లో 5జి ఫీచ‌ర్‌ను కూడా అందిస్తార‌ని తెలుస్తోంది. దీంతోపాటు 65 వాట్ల వార్ప్ చార్జ్ టెక్నాల‌జీని ఈ ఫోన్‌లో అందిస్తున్న‌ట్లు ఇప్ప‌టికే వ‌న్‌ప్ల‌స్ తెలిపింది. దీని వ‌ల్ల ఒక రోజంత‌టికీ స‌రిపోయే బ్యాట‌రీ బ్యాక‌ప్ కేవ‌లం 15 నిమిషాల చార్జింగ్‌తో ల‌భిస్తుంది.

వ‌న్‌ప్ల‌స్ 8టిలో 4500 ఎంఏహెచ్ బ్యాట‌రీని అందిస్తార‌ని తెలిసింది. అలాగే స్నాప్‌డ్రాగ‌న్ 865 ప్ల‌స్ ప్రాసెస‌ర్‌, 8జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్‌, వెనుక వైపు 48, 16, 5, 2 మెగాపిక్స‌ల్ కెమెరాలు ఉంటాయ‌ని తెలిసింది. అయితే ఈ ఫీచ‌ర్ల‌ను వ‌న్‌ప్ల‌స్ ఆ ఫోన్‌లో అందిస్తుందో, లేదో తెలియాలంటే ఫోన్ విడుద‌ల‌య్యే వ‌ర‌కు వేచి చూడాల్సిందే. ఇక శుక్ర‌వారం నుంచి వ‌న్‌ప్ల‌స్ 8టి 5జి ఫోన్‌కు గాను ప్రీ బుకింగ్స్ ను కూడా ప్రారంభించారు. ఈ ఫోన్‌ను ప్రీ బుకింగ్ చేసుకునే వారికి ఫోన్‌‌ను ముందుగా విక్ర‌యిస్తారు.