అలర్ట్ : మరో 3 గంటల పాటు భారీ వర్షం !

రెండు తెలుగు రాష్ట్రా ల్లోనూ వర్షాలు విపరీతం గా కురుస్తోన్న సంగతి తెలిసిందే. గత వారం రోజుల నుంచి ఇదే పరిస్థితి నెలకొంది.  ఇక తెలంగాణ రాష్ట్రం లో ఇవాళ కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్‌ వాతావరణ శాఖ స్పష్టం చేసింది. ఉపరితల ద్రోణి ప్రభావంతో రానున్న 3 గంటల్లో ఉత్తర మరియు పశ్చిమ తెలంగాణ జిల్లాలు ముఖ్యంగా మహా నగరం హైదరాబాద్‌ లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.

ఇక తెలంగాణ రాష్ట్రం లోని మిగిలిన జిల్లాల్లో తేలిక పాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు పడుతాయని పేర్కొంది వాతావరణ శాఖ. కాగా.. ఇవాళ ఉదయం నుంచి హైదరాబాద్‌ లోని ఎల్బీ నగర్‌, దిల్‌ సుఖ్‌ నగర్‌, ఖైరతాబాద్‌ , ఆర్టీసీ క్రాస్‌ రోడ్స్‌ మరియు జూబ్లీహిల్స్‌ తదితర ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. దీంతో జీహెచ్‌ ఎంసీ అధికారులు అప్రమత్తం అయ్యారు.