అఖిలపక్షం ఆధ్వర్యంలో ఇందిరా పార్కు వద్ద ధర్నా

తెలంగాణ రాష్ట్ర అఖిలపక్షం ఆధ్వర్యం లో కాసేపటి క్రితమే… ఇందిరా పార్కు వద్ద ధర్నా ప్రారంభం అయింది. కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా ధర్నా చేపిట్టింది తెలంగాణ అఖిల పక్షం. జాతీయ స్థాయి లో విపక్ష పార్టీలు తీసుకున్న నిర్ణయం మేరకు బీజేపీ, టీఆర్‌ఎస్‌ యేతర పార్టీలు మహా ధర్నా నిర్వహించాయి.

మూడు వ్యవసాయ చట్టాలు, పెట్రోల్‌, డీజిల్‌.. నిత్యావ సరాల ధరల పెరుగుదలను వ్యతిరేకిస్తూ ఈ మహా ధర్నా ను చేపట్టాయి పార్టీలు. అలాగే…. ఉపాధి హామీ పని దినాలు, కూలి ధరల పెంపు తదితర డిమాండ్ల పై కూడా ధర్నా చేస్తున్నాయి తెలంగాణ విపక్ష పార్టీలు. ఇవాళ సాయంత్రము వరకు ఈ ధర్నా కొనసాగనుంది. ఇక ధర్నా కార్యక్రమంలో ప్రధాన ప్రతి పక్షమైన కాంగ్రెస్ పార్టీ, టీజేఎస్ పార్టీ, సీపీఎం , సీపీఐ, టీడీపీ, ప్రజా సంఘాలు పాల్గొన్నాయి. ఇక ఈ ధర్నా కు కొన్ని కొందరు జర్నలిస్టులు కూడా మద్దతు పలికినట్లు తెలుస్తోంది.