హైదరాబాద్ లో వాన దంచికొడుతోంది. ఉదయం నుంచి మేఘావృతమై ఉన్న వాతావరణం సాయంత్రానికి ఒక్కసారిగా మారిపోయింది. నగరంలోని చందానగర్, మాదాపూర్ ,గచ్చిబౌలి, ప్రగతినగర్ , పటాన్ చెరు, రామచంద్రాపురం, నిజాంపేట్,అమీన్ పూర్ పరిసర్ ప్రాంతాల్లో వర్షం పడింది. జూబ్లీహిల్స్, బంజారా హిల్ష్, ఫిలింనగర్ , మెహదీపట్నం పరిసర ప్రాంతాల్లో భారీ కురుస్తోంది. లొతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.
మరో గంట పాటు కుండపోత వర్షం కురిసే అవకాశం ఉందని GHMC మేయర్ విజయలక్ష్మి వెల్లడించారు. ప్రజలు ఇళ్లలోనే ఉండాలని సూచించారు. వర్షానికి సంబంధించి ఏమైనా అత్యవసర సహాయం అవసరమైతే 040-21111111, 9000113667 నంబర్లకు ఫోన్ చేయాలన్నారు. మరో రెండు రోజులు హైదరాబాద్ నగర వ్యాప్తంగా మోస్తరు నంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావారణ శాఖ తెలిపింది.