నేడు ఐదో రోజు ఏపీ అసెంబ్లీ సమావేశం..సభ ముందుకు 11 బిల్లులు

-

అమరావతి : నేడు ఐదో రోజు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు జరుగనున్నాయి. ఈ నేపథ్యం లో నేడు అసెంబ్లీ లో ఏకంగా 9 బిల్లులు ప్రవేశపెట్టనుంది జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల సంక్షేమం – బీసీ జనగణన పై ఇవాళ అసెంబ్లీ లో చర్చ కొనసాగనున్నట్లు సమాచారం అందుతోంది. ముఖ్యంగా అసెంబ్లీ లో ఆరోగ్య రంగం పై స్వల్పకాలిక చర్చ జరుగనున్నట్లు సమాచారం అందుతోంది.

అటు ఇవాళ శాసన మండలి లో 11 బిల్లులు ప్రవేశ పెట్టనుంది జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం. అలాగే విద్యుత్ సంస్కరణలపై మండలి లో స్వల్పకాలిక చర్చ జరుగనున్నట్లు తెలుస్తోంది. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో రోడ్లు- రవాణా పరిస్థితి పై కౌన్సిల్ లో స్వల్పకాలిక చర్చ జరుగనుంది. కాగా ఈ శీతాకాల అసెంబ్లీ సమావేశాల్లో పలు కీలక సంఘటనలు చోటు చేసుకున్న సంగతి విదితమే. అసెంబ్లీ ప్రారంభమైన రెండో రోజే చంద్రబాబు నాయుడు కంటతడి పెట్టుకోవడంలో రాష్ట్ర రాజకీయాలను కుదిపేసింది. ఆ తర్వాత మూడు రాజధానులు నిర్ణయాన్ని రద్దు చేసుకుంటున్నట్లు… జగన్మోహన్రెడ్డి ప్రకటన చేసింది. ఇక నిన్న శాసన మండలి రద్దు బిల్లును కూడా వెనక్కి తీసుకుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం.

 

Read more RELATED
Recommended to you

Latest news