హలో అంకుల్స్.. మీ అబ్బాయికు ఈ విషయాలను నేర్పించడం మర్చిపోకండి..!

-

ప్రస్తుత కాలంలో ఆడపిల్లల రక్షణ ప్రశ్నార్థకంగానే మారింది. ఎన్ని చట్టాలు చేసినా, ఎంత కఠినమైన శిక్షలు వేస్తున్నా..మహిళలపై జరిగే అఘాయిత్యాలు ఆగడం లేదు. వయసుతో సంబంధం లేకుండా..ఎన్నో జీవితాలు మొగ్గలోనే తుంచేస్తున్నారు. మార్పు కఠినమైన శిక్షలు వేయటం వల్ల కాదు.. మనషుల్లో రావాలి. మొక్క దశలో ఉన్నప్పుడే కావాల్సిన పోషకాలు సమృద్దిగా అందిస్తే..అది పెద్దదై.. మంచి పండ్లను ఇస్తుంది.లేదంటే..ఏదోఒక పురుగుపట్టి..ఎందుకు పనికిరాకుండా పోతుంది. మనషులు కూడా అంతే.. ఎదిగే టైంలోనే పిల్లలకు అన్నీ నేర్పాలి. అప్పుడు పెద్దయ్యాక వాటిని ఆచరణలో పెట్టగలుగుతారు. అన్నీ పాటించకపోయినా.. కనీసం వాటిమీద అవగాహన అయినా పెంచుకుంటారు. మఖ్యంగా అబ్బాయిలను కన్న తల్లిదండ్రులు వారికి ఈ విషయాలను చిన్నప్పుడే అర్థమయ్యేలా చెప్పాలి..అ‌వేంటంటే..
స్త్రీవాదం అనేది సమానత్వమని మీ కొడుకుకు నేర్పండి. అలాగే లింగ వివక్ష చూపకూడదని అర్థమయ్యేలా చెప్పండి.
బాధవస్తే.. ఏడ్వాలి. ఏడ్వటం అనేది అమ్మాయిల ఆస్తి కాదు.. మగవాళ్లు కూడా ఏడ్వొచ్చు. వాళ్లు బాధలో ఉండి ఏడస్తుంటే..ఆడపిల్లలా ఏంట్రా ఆ ఏడుపు అని అస్సలు అనకండి. వాళ్లు బాధను ఆ వయసు నుంచే వ్యక్తపరచడం ఆపేస్తారు.
వంటగదికి సంబంధిచిన విషయాలలో కూడా మగపిల్లలకు అవగాహన ఉండాలి. వంట చేయడం, పాత్రలు కడుక్కోవడం వంటి పనులు స్త్రీలే కాకుండా కుటుంబంలో ప్రతి ఒక్కరు చేయాల్సినవని నేర్పించండి.
మనుషులతో సహా సహా ప్రతి జీవి దయకు అర్హుడని మీ కొడుకుకు నేర్పండి. ఎవ్వరి పట్ల అసభ్యకరంగా ప్రవర్తించవద్దని, పద్దతిగా ఉండాలని చెప్పండి. కులం, మతం, ఆడ, మగ అనే భేదం లేకుండా ప్రతి ఒక్కరూ గౌరవంగా ఉండాలని మీ కొడుకుకు నేర్పించండి. ఎప్పుడు కూడా అబద్దం చెప్పకూడదని సూచించండి
ఏదైనా సాధించాలంటే పట్టుదలతో ఉండాలని, మనిషి తలచుకుంటే సాధించలేనిది ఏది లేదని బోధించండి.
అహంకారానికి పోకుండా అందరితో కలిసి నడుచుకోవాలని చెప్పండి. సాన్నిహిత్యంగా ఉండడమే కాకుండా గౌరవం ఇవ్వడం నేర్చుకోవాలని చెప్పండి.
ఎలాంటి విషయాలనైనా మనసులో ఉంచుకోకుండా బహిరంగంగా చెప్పడం నేర్చుకోవాలని చెప్పండి.
జీవితం ఎల్లప్పుడూ పరిపూర్ణంగా ఉండదని, ఒకరి రూపాన్ని, వేషాధారణను లేదా నైపుణ్యాలను ఎగతాళి చేయకూడదని సూచించండి.
అవసరమైన సమయంలో సహాయం చేయడానికి వెనుకాడకూడదు.. సమస్యలను ప్రశాంతగా పరిష్కరించడానికి ప్రయత్నించాలని. పోరాటం, ఆవేశం ఏ సమస్యను పరిష్కరించలేవని చెప్పండి.
పరిశుభ్రమైన పద్దతులను అనుసరించాలని, రోజువారీగా గోర్లు కత్తిరించుకోవడం, గదులను శుభ్రంగా ఉంచుకోవడం కూడా అలవాటు చేయండి.
అబ్బాయిలకే కాదు.. అమ్మాయిలకు కూడా నేర్పించాలి. చిన్నపిలల్లుగా ఉన్నప్పుడే వారికి అన్ని అర్థమయ్యేలా చెప్తే.. మంచికి చెడుకు తేడా తెలుసుకుంటారు. కొందరు ఇవన్నీ పిల్లల్ని పెంచే మాకు తెలియదా అనుకుంటారామో..తెలిస్తే.. ఆడపిల్లలను బయటకు పంపేందుకు ఏ తల్లిందండ్రులు ఈరోజు ఇంతలా బయపడరు. అమ్మాయిల రక్షణ యాప్స్ లో ఉండేది కాదేమో.
-Triveni Buskarowthu

Read more RELATED
Recommended to you

Latest news