ఆదుకున్న రోహిత్ శర్మ….. లంచ్ స‌మ‌యానికి స్కోర్….?

-

ఇంగ్లండ్తో జరుగుతున్న మూడో టెస్టులో భారత్ లంచ్ బ్రేక్ సమయానికి 3 వికెట్ల నష్టానికి 93 రన్స్ చేసింది. కెప్టెన్ రోహిత్ శర్మ(52*), రవీంద్ర జడేజా(24*) క్రీజులో ఉన్నారు.

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇండియాకి ఆదిలోనే షాక్ త‌గిలింది. వైజాగ్ టెస్టులో ద్వి శతకంతో మెరిసిన ఓపెన‌ర్ య‌శ‌స్వీ జైస్వాల్(10) మార్క్ వుడ్ బౌలింగ్ లో స్లిప్‌లో ఉన్న జో రూట్ చ‌క్క‌ని క్యాచ్ ప‌ట్ట‌డంతో పెవిలియన్ చేరాడు. ఆ త‌ర్వాత శుభ్‌మ‌న్ గిల్(0)ను డ‌కౌట్‌గా అవుట్ చేశాడు. వైజాగ్ టెస్టులో ఆక‌ట్టుకున్న‌ ర‌జ‌త్ పాటిదార్(5)ను టామ్ హ‌ర్ట్లే ఔట్ చేసి భారత్ ను మ‌రింత క‌ష్టాల్లోకి నెట్టాడు.

 

33 రన్స్ కే మూడు కీల‌క వికెట్లు ప‌డ‌డంతో ఇంగ్లండ్ టీం మ్యాచ్‌పై ప‌ట్టు బిగించింది. అయితే.. కెప్టెన్ హిట్ మ్యాన్ త‌న స‌హ‌జ ఆట‌ను ప‌క్క‌న‌పెట్టి నిదానంగా ఆడుతూ.. రవీంద్ర జ‌డేజాతో క‌లిసి కీల‌క భాగ‌స్వామ్యం నిర్మించాడు. దాంతో, తొలి సెష‌న్‌లో మ‌రో వికెట్ తీసేందుకు స్టోక్స్ బౌల‌ర్ల‌ను మార్చినా ఫ‌లితం లేక‌పోయింది.ఇంగ్లండ్ బౌలర్లలో వుడ్ 2, హార్టీ ఒక వికెట్ తీశారు.

Read more RELATED
Recommended to you

Latest news