మోడీ ఆరోగ్య సూత్రం అదే..

సెప్టెంబర్ 17వ తేదీన భారత ప్రధాని మోడీ 70వ వసంతంలోకి అడుగుపెట్టారు. 70ఏళ్ల వయసులోనూ మోడీ చాలా ఆరోగ్యంగా ఉంటారు. ఈ విషయమై చాలా మందికి ఆశ్చర్యం కలుగుతుంటుంది. ఆ ఆశ్చర్యంలో నుండి మోడీ ఫిట్ నెస్ సూత్రం ఏంటబ్బా అని ఆలోచిస్తుంటారు. తాజాగా మోడీ ఫిట్ నెస్ సీక్రెట్ బయటపడింది. ఆయనే ఆ విషయాన్ని బయటపెట్టారు. తాజాగా పలువురు ఫిట్ నెస్ నిపుణులు, క్రీడాకారులతో ముచ్చటించిన మోడీ ఈ విషయన్ని అందరితో పంచుకున్నారు.

ఫిట్ నెస్ నిపుణులలో ఒకరైన మిలింద్ సోమన్ మోడీగారి ఆరోగ్యసూత్రం ఏమిటంటూ ప్రశ్న వేసాడు. దీనికి బదులిచ్చిన మోడీగారు ఈ విధంగా చెప్పారు. వారానికి రెండుసార్లు మా అమ్మ నాకు ఫోన్ చేస్తుంటుంది. చేసిన ప్రతీసారీ ఆహారంలో పసుపు సరిగ్గా తీసుకుంటున్నావా అని అడుగుతుంటుంది. నేను అవును అంటాను. పసుపు ఆరోగ్యానికి మంచిది. తగినంత పసుపు ఆహారంలో తీసుకోవడం ఉత్తమం అంటూ సూచించారు.