భార‌త్‌లో అన్ని క‌రోనా వ్యాక్సిన్ల ధ‌ర‌లు ఎంత ఉండే అవ‌కాశం ఉందంటే..?

-

క‌రోనా వైర‌స్ ప్ర‌పంచ‌వ్యాప్తంగా విజృంభిస్తున్న వేళ ప్ర‌జ‌లంద‌రూ వ్యాక్సిన్ల కోసం ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. ర‌ష్యా ఇప్ప‌టికే ప్ర‌జ‌ల‌కు వ్యాక్సిన్ పంపిణీని ప్రారంభించ‌గా ఈ వారం నుంచి యూకేలోనూ క‌రోనా వ్యాక్సిన్‌ను ప్ర‌జ‌ల‌కు ఇవ్వ‌నున్నారు. ఇక భార‌త్‌లో డిసెంబ‌ర్ చివ‌రి వారంలో లేదా జ‌న‌వ‌రి మొద‌టి వారంలో వ్యాక్సిన్ పంపిణీ ప్రారంభం కావ‌చ్చ‌ని తెలుస్తోంది.

here it is how much corona vaccines of different companies may cost in india

ప్ర‌ధాని మోదీ ఇప్ప‌టికే అన్ని రాష్ట్రాల సీఎంల‌తో చ‌ర్చించి వ్యాక్సిన్ పంపిణీ కోసం రూట్ మ్యాప్‌ను సిద్ధం చేసి పెట్టారు. ఈ క్ర‌మంలో దేశంలో ఉన్న ఫ్రంట్ లైన్ వారియ‌ర్ల‌కు ముందుగా కోవిడ్ వ్యాక్సిన్‌ను పంపిణీ చేస్తారు. త‌రువాత దీర్ఘ‌కాలిక అనారోగ్య స‌మ‌స్య‌లు ఉన్న‌వారికి, ఆ త‌రువాత సాధార‌ణ ప్ర‌జ‌ల‌కు వ్యాక్సిన్ పంపిణీ ఉంటుంది. ఇక దేశంలో ప‌లు వ్యాక్సిన్‌లు ఫేజ్ 3 ట్ర‌య‌ల్స్‌ను ముగించుకుని పంపిణీకి సిద్ధ‌మ‌వుతుండ‌గా, కొన్ని వ్యాక్సిన్ల‌కు ఇప్పుడే ఫేజ్ 3 ట్ర‌య‌ల్స్ నిర్వ‌హిస్తున్నారు.

అయితే అంత‌ర్జాతీయంగా ప‌లు వ్యాక్సిన్ల ధ‌ర‌ల‌ను ఇప్ప‌టికే ఆయా దేశాల్లో నిర్ణ‌యించినా భార‌త్‌లో మాత్రం క‌రోనా వ్యాక్సిన్ల ధ‌ర‌లు ఇంకా నిర్దార‌ణ కాలేదు. మ‌రోసారి అన్ని రాష్ట్రాల‌తో చ‌ర్చించి ప్రధాని మోదీ వ్యాక్సిన్ల ధ‌ర‌ల‌ను నిర్ణ‌యించ‌నున్నారు. అయితే మ‌న దేశంలో ల‌భ్యం కానున్న వ్యాక్సిన్ల ధ‌ర‌లు ఎంత వ‌ర‌కు ఉండే అవ‌కాశం ఉందో నిపుణులు చూచాయ‌గా చెబుతున్నారు. వారి వివ‌రాల ప్ర‌కారం…

* భార‌త్ బ‌యోటెక్‌కు చెందిన కోవాగ్జిన్ ధ‌ర రూ.100 క‌న్నా త‌క్కువ‌గానే ఉండే అవ‌కాశం ఉంది.

* నోవావాక్స్ వ్యాక్సిన్ ఒక్క డోసు ధ‌ర రూ.250 వ‌ర‌కు ఉండే అవ‌కాశం ఉంది.

* కోవాక్స్ వాక్యిన్స్ ఒక్క డోసు ధ‌ర రూ.250 నుంచి రూ.300 వ‌ర‌కు ఉండే అవ‌కాశం ఉంది.

* ర‌ష్యాకు చెందిన స్పుత్‌నిక్‌-వి వ్యాక్సిన్ ధ‌ర ఒక్క డోసు రూ.500 నుంచి రూ.750 వ‌ర‌కు ఉండే అవ‌కాశం ఉంది. డాక్ట‌ర్ రెడ్డీస్ ల్యాబ్ వారు ఈ వ్యాక్సిన్‌కు భార‌త్‌లో ఫేజ్ 3 ట్ర‌య‌ల్స్ ను చేప‌ట్టారు.

* సీర‌మ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియాకు చెందిన ఆక్స్‌ఫ‌ర్డ్‌, ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ ధ‌ర రెండు డోసులకు రూ.1వేయి వ‌ర‌కు ఉండే అవ‌కాశం ఉంది. దీన్ని భార‌త్‌లో కోవిషీల్డ్ పేరిట విక్ర‌యిస్తారు.

* మోడెర్నాకు చెందిన ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్ సింగిల్ డోస్ ధ‌ర రూ.2700 వ‌ర‌కు ఉండే అవ‌కాశం ఉంది.

* ఫైజ‌ర్ క‌రోనా వ్యాక్సిన్ మ‌న దేశంలో ల‌భిస్తుందీ లేనిదీ తెలియ‌దు. ఎందుకంటే ఈ వ్యాక్సిన్‌ను స్టోర్ చేసేందుకు క‌నీసం -70 డిగ్రీల సెల్సియ‌స్ ఉష్ణోగ్ర‌త ఉండే ప‌రిక‌రాలు కావాలి. ఇక్క‌డ అందుకు అవ‌కాశం లేదు క‌నుక మ‌న దేశంలో ఈ వ్యాక్సిన్ వ‌స్తుందా, రాదా అన్న విష‌యంలో ఇంకా స్ప‌ష్ట‌త రాలేదు. అయితే ఈ వ్యాక్సిన్ ఒక్క డోసు ధ‌ర అంత‌ర్జాతీయ మార్కెట్‌లో 20 డాల‌ర్లు (దాదాపుగా రూ.1475) ఉండే అవ‌కాశం ఉన్న‌ట్లు తెలుస్తోంది.

అయితే పైన తెలిపిన వ్యాక్సిన్ల ధ‌ర‌లు అంతే ఉండాల‌ని ఏమీ లేదు. వారు వ్యాక్సిన్‌ను విడుద‌ల చేసిన‌ప్పుడు ఆ ధ‌ర‌ల్లో హెచ్చు త‌గ్గులు ఉండ‌వ‌చ్చు. కేవ‌లం ప్ర‌జ‌ల అవ‌గాహ‌న కోసం మాత్ర‌మే ఈ స‌మాచారాన్ని అంద‌జేయ‌డం జ‌రిగింది.

Read more RELATED
Recommended to you

Latest news