కొత్త ఐఫోన్‌ కొందామనుకుంటున్నారా ? మీ పాత ఐఫోన్లకు యాపిల్‌ ఎంత ఇస్తుందో తెలుసుకోండి..!

సాఫ్ట్‌వేర్‌ సంస్థ యాపిల్‌ ఇటీవలే భారత్‌లో ఆన్‌లైన్‌ స్టోర్‌ను ప్రారంభించిన విషయం విదితమే. అందులో అన్ని యాపిల్‌ ఉత్పత్తులను వినియోగదారులు ఆర్డర్‌ చేయవచ్చు. ఇంటికే ప్రొడక్ట్స్‌ డెలివరీ అవుతాయి. భిన్న రకాల పేమెంట్‌ ఆప్షన్లు కూడా అందులో లభిస్తున్నాయి. అయితే వినియోగదారులు తమ వద్ద ఉండే పాత ఐఫోన్లను ఎక్స్‌ఛేంజ్‌ చేసి కొత్త ఐఫోన్లను కొనవచ్చు. పాత ఐఫోన్లకు యాపిల్‌ నిర్దిష్టమైన ఎక్స్‌ఛేంజ్‌ విలువలను అందిస్తోంది. మరి మీ పాత ఐఫోన్లకు యాపిల్‌ ఎంత మొత్తం విలువను అందిస్తుందో ఇప్పుడు తెలుసుకుందామా..?

here it is how much you can get for your old iphones

– ఐఫోన్‌ 11 ప్రొ మ్యాక్స్‌ను యాపిల్‌ ఇండియా ఆన్‌లైన్‌ స్టోర్‌లో ఎక్స్‌ఛేంజ్‌ చేస్తే రూ.63వేలు పొందవచ్చు. ఐఫోన్‌ 11 ప్రొకు రూ.60వేల ఎక్స్‌ఛేంజ్‌ విలువ లభిస్తుంది. ఐఫోన్‌ 11కు రూ.37వేలు పొందవచ్చు.

– ఐఫోన్‌ ఎక్స్‌ఎస్‌ మ్యాక్స్‌కు రూ.35వేలు ఇస్తారు. ఐఫోన్‌ ఎక్స్‌ఎస్‌కు రూ.34వేలు ఇస్తారు. ఐఫోన్‌ ఎక్స్‌ఆర్‌కు రూ.24వేలు ఇస్తారు. ఐఫోన్‌ ఎక్స్‌కు రూ.28వేలు పొందవచ్చు.

– ఐఫోన్‌ 8 ప్లస్‌కు రూ.21వేలు పొందవచ్చు. ఐఫోన్‌ 8కు రూ.17వేలు ఇస్తారు. ఐఫోన్‌ 7 ప్లస్‌ ఎక్స్‌ఛేంజ్‌ విలువ రూ.17వేలుగా ఉంది. ఐఫోన్‌ 7కు రూ.12వేలు, ఐఫోన్‌ 6ఎస్‌ ప్లస్‌కు రూ.9వేలు, ఐఫోన్‌ 6ఎస్‌కు రూ.8వేలు, ఐఫోన్‌ 6 ప్లస్‌కు రూ.8వేలు, ఐఫోన్‌ 6కు రూ.6వేలు, ఐఫోన్‌ ఎస్‌ఈ (పాతది)కి రూ.5వేలు, ఐఫోన్‌ 5ఎస్‌కు రూ.3వేల ఎక్స్‌ఛేంజ్‌ విలువను పొందవచ్చు.

ఆయా ఫోన్లను యాపిల్‌ ఇండియా ఆన్‌లైన్‌ స్టోర్‌లో ఎక్స్‌ఛేంజ్‌ చేస్తే కొత్త ఫోన్‌పై ఆ మేర ఎక్స్‌ఛేంజ్‌ డిస్కౌంట్‌ ఇస్తారు. దీంతో తగ్గింపు ధరలకు కొత్త ఐఫోన్లను కొనవచ్చు.