అక్కినేని అఖిల్ కు బాడ్ టైమ్ నడుస్తుంది గురూ..!!

-

అక్కినేని నాగార్జున ముద్దుల కొడుకు అక్కినేని అఖిల్ పరిస్థితి ఏ మాత్రం బాగాలేదు. ఎన్నో ఆశలతో సినిమా పరిశ్రలోకి అడుగు పెడితే నికార్సైన హిట్ ఒక్కటి రాలేదు. మొదటి సినిమా తోనే పెద్ద యాక్షన్ స్టార్ అవ్వాలనుకుంటే అది బోల్తా కొట్టింది. సినిమాల్లో రాక ముందు అఖిల్ సినిమాల్లోకి రావాలని మీడియా లో ఒకటే గోలగా ఉండేది. తీరా వచ్చిన తర్వాత వచ్చిన మొత్తం క్రేజ్ మొత్తం పొయింది.

ప్రస్తుతం స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అఖిల్  స్పై యాక్షన్ థ్రిల్లర్ ‘ఏజెంట్’ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా ను ఏకె ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై అనిల్ సుంకర అత్యంత భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు.తెలుగుతో పాటు పాన్ ఇండియా టార్గెట్ గా అనేక భాషల్లో  ఒకే సారి రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు.

ఈ రిలీజ్ కోసం చిత్ర యూనిట్ వర్గాలు, నిర్మాత పెద్ద యుద్దం చేయాల్సి వస్తోంది. ఈ సినిమా కోసం సంవత్సరం నుండి విపరీత కష్టాలు పడుతున్నారు. సినిమా మంచిగా రాలేదని రీషూట్ చేశారు.ఇక బడ్జెట్ ఎక్కువ అయ్యిందని,  అలాగే అందరూ పాన్ ఇండియా అంటున్నారని పాన్ ఇండియా రేంజ్ రిలీజ్ టార్గెట్ పెట్టారు. ఇక ఈ సినిమా వేసవి, దసరా, దీపావళి, సంక్రాంతి కూడా దాటుకొని వెళ్ళిపోయింది. ఫిబ్రవరి నెలలో పక్కా అని అంటున్నారు. ఇక అదికూడా డౌటే అని మరికొందరు అంటున్నారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version