రూ.10 లక్షలు విరాళం ప్రకటించిన ధనుష్..

75

కరోనా వ్యాప్తి రోజురోజుకీ పెరిగిపోతోంది. దీంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ ప్రకటించేశాయి. గత కొన్ని రోజులుగా దేశ వ్యాప్తంగా అన్ని రంగాలు మూతబడ్డాయి. దీంతో అన్ని రంగాల వారు పనులు లేక ఇళ్ళ వద్దే ఖాళీగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే అన్నిటికన్నా ముందుగా సినిమా ఇండస్ట్రీ గురించి చెప్పాలి. లైట్ మ్యాన్ దగ్గర్నుంచి చాలా మంది రోజువారి కూలీలు సినిమా కోసం పనిచేస్తుంటారు.

 

సినిమా షూటింగ్ లు బంద్ అవడంతో వారంతా ఇప్పుడు జీవనోపాధిని కోల్పోయారు.  దీంతో పలువురు హీరోలు, డైరెక్టర్లు వారిని ఆదుకోవడానికి ముందుకొస్తున్నారు. తమిళ స్టార్ హీరో ధనుష్ రూ.15 లక్షలను భారత సినీ కార్మిక సంఘాల సమాఖ్యకి అందజేశాడు. దర్శకుడు శంకర్, కమల్ హాసన్ చెరో 10 లక్షలు ఇచ్చారు.

ఇప్పటికే రజినీ కాంత్ 50 లక్షలు, విజయ్ సేతుపతి 10 లక్షలు తమ వంతు బాధ్యతగా అందించారు.అయితే తెలుగులో రాజశేఖర్ మాత్రమే విరాళం అందించాడు. ఇంకెంత మంది తెలుగు హీరోలు మందుకొచ్చి వారిని ఆదుకుంటారో వేచి చూడాలి.