గాలి ద్వారా కరోనా వ్యాప్తి చెందుతుందా…

43

అనేక మంది గాలి ద్వారా కరోనా వస్తుందని చాలా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే దీనిపై వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వివరణ ఇచ్చింది. యునిసెఫ్ గుడ్విల్ అంబాసిడర్, హాలివుడ్ నటి ప్రియాంక అడిగిన ప్రశ్నకు who చీఫ్ సమాధానం ఇచ్చారు. గాలి ద్వారా కరోనా ఇతరులకు సోకదని చెప్పారు. అయతే కరోనా వచ్చిన వ్యక్తి తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు మాత్రం ఆ తుంపర్లు గాలిలో కలిసి 3 మీటర్ల లోపు దూరంలో ఉన్న వ్యక్తులపై పడి ప్రభావం చూపుతుందన్నారు.

 

అయితే దోమల వల్ల కూడా కరోనా వ్యాప్తి జరగుతుందేమో అని చాలా మంది భయపడుతున్నారు. ఇలాంటి భయంపై కూడా కేంద్ర ఆరోగ్య శాఖ వివరణ ఇచ్చింది.  దోమకాటు ద్వారా కరోనా రాదని స్పష్టం చేసింది. అలాగే వెల్లుల్లి తినడం, ఆల్కహాల్ తాగడం వల్ల కరోనాను అడ్డుకోలేదరని పేర్కొంది. మాస్కులు అందరూ వాడాల్సిన అవసరం కూడా లేదని చెపింది. కేవలం జ్వరం, దగ్గు, కరోనా లక్షణాలు ఉన్న వాళ్లు మాత్రమే మాస్కులు వాడితే సరిపోతుందని చెప్పింది..