హీరో రానా ఆరేళ్ల నాటి సినిమా.. విడుద‌లకు సిద్ధం

-

ద‌గ్గుబాటి రానా హీరో గా న‌టించిన 1945 అనే పీరియాడిక‌ల్ డ్రామా సినిమా ను ఆరేళ్ల కింద ప్రారంభించారు. ఈ సినిమా అనేక కార‌ణాల తో వాయిదా పడుతూ వ‌స్తుంది. ఈ సినిమా ను ఇప్పుడు విడుద‌ల చేయాల‌ని చిత్ర బృందం భావిస్తుంది. ఈ నెల 31 న ఈ 1945 అనే సినిమా ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురావాల‌ని చిత్ర బృందం నిర్ణ‌యించింది. అయితే ఈ సినిమా లో ద‌గ్గుబాటి రానా హీరో గా రెజీనా కసాండ్రా హీరోయిన్ గా న‌టించారు.

అలాగే స‌త్యార‌జ్, నాజ‌ర్ ప్ర‌ధానా పాత్ర‌ల‌లో న‌టించారు. ఈ సినిమా ను స‌త్యశివ అనే డైరెక్ట‌ర్ తెర‌కెక్కించాడు. 2015 లో ఈ సినిమా షూటింగ్ ప్రారంభించారు. యువ‌న్ శంక‌ర్ రాజా ఈ సినిమా కు సంగీతాన్ని అందించాడు. అయితె ఈ 1945 అనే సినిమా ను త‌మిళం లో మ‌దై తిరంతు అనే పేరుతో వ‌చ్చింది. అయితే ఈ సినిమా లో సుభాష్ చంద్ర బోస్ చేసినా.. పోరాటాల గురించి వివ‌రిస్తుంది. అయితే నిర్మాత విష‌యం లో కాస్త వివాదాలు రావ‌డం తో సినిమా విడుద‌ల ఆల‌స్యం అయింది.

Read more RELATED
Recommended to you

Latest news