2030 నాటికి భారత్ కు సొంత అంతరిక్ష కేంద్రం.. లోక్ సభలో కేంద్రం కీలక ప్రకటన

-

అంతరిక్ష కేంద్రం ఏర్పాటుపై కేంద్రం మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ కీలక ప్రకటన చేశారు. దేశంలో అంతరిక్ష పరిశోధనలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నామని ఆయన వెల్లడించారు. 2030 నాటికి భారత దేశం సొంతంగా అంతరిక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేస్తుందని ఆయన ప్రకటించారు. ఇస్రో భవిష్యత్ ప్రాజెక్ట్ లకు సంబంధించి ఓ ఎంపీ అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం ఇచ్చారు.  దేశ అంతరిక్ష కార్యక్రమాన్ని వేగవంతం చేసేందుకు ప్రైవేట్ పరిశ్రమలు, స్వదేశీ స్టార్టప్‌లపై దృష్టి సారించినట్లు తెలిపారు. ఈ మేరకు పలు అంశాలను వెల్లడించారు. 2022 లో చంద్రయాన్ ప్రాజెక్ట్ ప్రారంభం అవుతుందని తెలిపారు. వీనస్ మిషన్ కూడా ప్రతిపాదనలో ఉందని వెల్లడించారు. 2023లో ఆదిత్య సోలార్ మిషన్ ను ఇస్రో చేపడుతుందని మంత్రి వెల్లడింాచారు. 2022లో రెండు మానవ రహిత మిషన్లను ఇస్రో ప్రయోగించనుందని తెలిపారు. 2022 చివరి నాటికి రోబో ఆధారిత మిషన్ అయిన వ్యోమమిత్రను ప్రయోగిస్తుంది. ఈ మిషన్ ప్రతిష్టాత్మక మానవ సహిత అంతరిక్ష ‘గగన్‌యాన్’ ప్రయోగానికి మార్గదర్శకంగా పనిచేస్తుందని మంత్రి వెల్లడించారు.

 

Read more RELATED
Recommended to you

Latest news