బ్రేకింగ్‌ : ఈడీ విచారణకు హాజరైన రవితేజ

టాలీవుడ్‌ డ్రగ్స్‌ లో కాసేపటి క్రితమే… హీరో రవితేజ హజరయ్యారు. హీరో రవితేజ తో పాటు అతని డ్రైవర్ శ్రీనివాస్ విచారణకు ఈడి ముందు హాజరు అయ్యారు. గెస్ట్ హౌజ్ నుండి బయల్దేరిన రవితేజ… నేరుగా ఈడీ కార్యాలయానికి చేరుకున్నారు. రవితేజను ఇవాళ సాయంత్ర వరకు ఈడీ అధికారులు విచారణ చేయనున్నారు.

నిన్న హీరో రానా ను విచారించిన ఈడీ అధికారులు…. ఇవాళ హీరో రవితేజ ను విచారణ చేయనున్నారు. డ్రగ్స్‌ వ్యవహరం, మనీ లాండరీంగ్‌ వ్యవహారాలపై రవితేజ నుంచి కూపీ లాగనున్నారు. కాగా.. మీడియా కంటపడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు సినీ తారలు. ఇప్పటి వరకు పూరి జగన్నాథ్‌, ఛార్మీ కౌర్, రకుల్ ప్రీతి సింగ్‌, నందు, హీరో దగ్గుబాటి రానా లు విచారణకు హాజరైన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఇవాళ ఈడి ముందు హజరయ్యారు రవితేజ‌. అయితే.. ఇంటి నుండి కాకుండా హోటళ్ళు, గెస్ట్ హౌస్ లో నుండి ఈడి విచారణ కు వస్తున్నారు సినీ తారలు.