విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్..!

ఏపీలో విద్యాసంస్థ‌ల‌ను తెర‌చిన సంగ‌తి తెలిసిందే. విద్యాసంస్థ‌లు తెర‌వ‌టంతో విద్యార్థులు కూడా పాఠ‌శాల‌కు క్లాసుల‌కు హాజ‌ర‌వుతున్నారు. అయితే కొన్ని ప్రాంతాల్లో స్కూల్ల‌లో క‌రోనా కేసులు బ‌య‌ట‌ప‌డ్డాయి. దాంతో ప్ర‌భుత్వం క‌ఠిన నిబంధ‌న‌లు అమలు చేస్తోంది. తాజాగా క‌రోనా మందును విద్యార్థుల‌కు ఉచితంగా పంపిణీ చేస్తామ‌ని ఏపీ ప్ర‌భుత్వం వెల్ల‌డించింది.

Good news for st students
Good news for st students

ఈమేర‌కు విద్యాశాఖ మంత్రి ఆదిమూల‌పు సురేష్ ప్ర‌క‌ట‌న చేశారు. రాష్ట్రంలో పాఠశాల‌లు ప్రారంభమైన నేప‌థ్యంలో క‌రోనా వ్యాప్తి చెంద‌కుండా చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని విద్యాశాఖ మంత్రి ఆదిమూల‌పు సురేష్ అన్నారు. దీనికోసం ఆయుష్ శాఖ ద్వారా మందును పంపిణీ చేస్తామ‌ని ప్ర‌క‌టించారు. ప్రాజెక్ట్ అమృత్ పేరుతో ప్రారంభిస్తున్న ఈ కార్య‌క్ర‌మం ద్వారా ఉచితంగానే మందును పంపిణీ చేస్తామ‌ని తెలిపారు.