బాధ పెడితే నాకేంటి : సమంత పై సిద్ధార్థ్ సంచలన వ్యాఖ్యలు !

అక్కినేని నాగచైతన్య మరియు సమంత విడాకులు తీసుకుంటున్న విషయాన్ని ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో.. చాలా మంది అభిమానులు షాక్ కు గురయ్యారు. ఎంత మంచి జంట విడిపోవడం ఏంటి అని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక మరికొందరేమో సమంత పై ట్రోలింగ్ కూడా చేస్తున్నారు.

అయితే సమంత మరియు నాగచైతన్య విడాకులపై ప్రకటన చేసిన రోజే సిద్ధార్థ ఓ ట్వీట్ చేశాడు. మోసం చేసే వాళ్ళు ఎప్పుడూ బాగుపడరు అంటూ పేర్కొన్నాడు సిద్ధార్త్. ఆ ట్వీట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. అయితే ఆ ట్వీట్ పై తాజాగా క్లారిటీ ఇచ్చాడు సిద్ధార్థ్.

తాను సమంత ను ఉద్దేశించి ట్వీట్ చేయలేదని… సిద్ధార్త్ ఓ ప్రముఖ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. తన జీవితంలో జరిగిందే తాను ఆరోజు ట్రీట్ చేశానని… ఎవరో తన గురించి అనుకుంటే తానేమీ చేయలేనని సిద్ధార్థ చెప్పుకొచ్చారు. మా ఇంటి దగ్గర కుక్కల సమస్య ఉంటే… నేను దాన్ని ట్వీట్ చేస్తే.. దానికి ఎవరో బాధపడితే తనకేం సంబంధం ? అంటూ సిద్ధార్థ పేర్కొన్నారు.