తెలుగు రాష్ట్రాలకే కాదు దేశానికే ప్రతిష్టాత్మకంగా భావించే విశాఖ స్టీల్ ప్లాన్ ని త్వరలో మూసేస్తున్నారని అంటున్నారు సిని నటుడు శివాజీ. తాజాగా ఒక ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేసారు. ఉత్తర కొరియాకు చెందిన ఐరన్ కంపెనీ పోస్కో కోసం మన విశాఖ స్టీల్ ఫ్యాక్టరీని మూసేస్తున్నారని, విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని చంపేస్తున్నారు ఇది నిజమని ఆయన సంచలన వ్యాఖ్యలు చేసారు.
దాదాపు 40వేలమంది ఉద్యోగులు, లక్షమంది ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉక్కు కర్మాగారంలో పనిచేస్తున్నారని… ఏపీ, తెలంగాణకు చెందిన నాయకులు పోరాడి విశాఖ ఉక్కు కార్మాగారాన్ని సాధించుకున్నారని ఆయన వ్యాఖ్యానించారు. 60వేల ఎకరాలు ఇచ్చిన రైతుల త్యాగఫలమని శివాజీ అన్నారు. తాజాగా ఉక్కు శాఖ మంత్రి జగన్‌ను కలిసింది కూడా ఇదే విషయమై చర్చించడానికేనని బాంబు పేల్చారు ఆయన.
పోస్కో కంపెనీకి సంబంధించిన భూముల కోసం కేంద్రమంత్రి ఏపీ ముఖ్యమంత్రితో సమావేశమయ్యారని, అది మర్యాదపూర్వక భేటీ కాదన్నారు. వాళ్ల ఒప్పందాల కోసం వచ్చారన్నారని… అప్పట్లో విశాఖ ఉక్కు పరిశ్రమ కోసం 60వేల ఎకరాలు ఇచ్చిన రైతులకు కేవలం 150 గజాలు స్థలం ఇచ్చారన్నారు. ఈ ఎపిసోడ్ మొత్తానికి మీడియేటర్ చేస్తున్న వ్యక్తి ఎవరో తనకు తెలుసన్న శివాజీ… కానీ ఆయన ఎవరో చెప్పనన్నారు. తెలుగు వ్యక్తి ఢిల్లీలో పదవిలో ఉన్న వ్యక్తేనని వ్యాఖ్యానించారు. మరి విశాఖపై అమితమైన ప్రేమ కురిపిస్తున్న