హీరో సూర్యకు కరోనా పాజిటివ్

Join Our Community
follow manalokam on social media

కరోనా ఉదృతి క్రమంగా తగ్గుతోంది. ఇప్పటికే కరోనా కేసులు బాగా అదుపులోకి వచ్చాయి. అయినా సరే సెలబ్రిటీలకు మాత్రం కరోనా భయం తప్పడం లేదు. తాజాగా తమిళ హీరో సూర్యకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా తన ట్విటర్ ద్వారా తెలియ జేశారు.

surya
 

‘నేను కరోనాతో బాధపడుతున్నా, ప్రస్తుతానికి ట్రీట్మెంట్ తీసుకుంటూ ఆరోగ్యంగానే ఉన్నా, బయట పరిస్థితులు, మన జీవితం ఇంకా సాధారణ పరిస్థితికి రాలేదన్న విషయాన్ని మనందరం గ్రహించాలి’ అని ఆయన అన్నారు. ‘అలా అని కరోనా భయంలో మునిగిపోనక్కరలేదు, ​కానీ జాగ్రత్తగా ఉండాలి. నాకు వైద్యం అందిస్తున్న, అంకిత భావంతో పనిచేస్తున్న వైద్యులకు నా ప్రేమ పూర్వక ధన్యవాదాలు’ అని తన ట్వీట్‌ లో పేర్కొన్నారు. ఇక సూర్య నటించిన సూరారై పోట్రు సినిమా ఆస్కార్ కు కూడా ఎంపికయిన సంగతి తెలిసిందే.

TOP STORIES

భక్తి: మాఘ పౌర్ణమి నాడు ఏం చెయ్యాలి..?

మాఘ పౌర్ణమి చాల ప్రత్యేకమైన రోజు. ఆరోజు హిందువులు ప్రత్యేక పూజలు చేయడం, నదీ స్నానాలని చేయడం చేస్తారు. అలానే ధానం చేయడం మొదలైన వాటిని...