BREAKING : తెలంగాణ సీఎం కేసీఆర్ ను కలిసిన హీరో విజయ్

-

తమిళ సినీహీరో విజయ్ నేడు ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు గారిని మర్యాదపూర్వకంగా కలిసారు.ఇందులో భాగంగా తమిళ సినీహీరో విజయ్ ను రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ గారు దగ్గర ఉండి తీసుకెళ్లారు.ఈ సందర్భంగా విజయ్ ని సిఎం కెసిఆర్ శాలువాతో సన్మానించారు.

హీరో విజయ్ తో పాటు వంశీ పైడిపల్లి కూడా ప్రగతి భవన్ కు వచ్చారు. దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి.  ఇది ఇలా ఉండగా ప్రస్తుతం హీరో విజయ్ టాలీవుడ్ దర్శకుడు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news