హీరో విశాల్ తెలివికి దండం సామి..!!

-

తమిళ హీరో తాజాగా విశాల్ ‘లాఠీ’తో ప్రేక్షకుల ముందుకొస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా పై భారీ అంచనాలున్నాయి. ఇప్పటికే రిలీజ్ అయిన ప్రచార చిత్రాలకు సినిమాపై అంచనాలు పెంచేసాయి. హిట్ అవుతుందని కొందరు ముందే జోస్యం చెబుతున్నారు.ఈ చిత్రం విడుదల సందర్భం గా హీరో విశాల్ తెలుగు రాష్ట్రాల్లో సినిమా ప్రమోషన్స్ కోసం చాలా కష్టపడుతున్నాడు.

ఇక తాను మొన్న మోహన్ బాబు తో కలసి చేసిన ఈవెంట్ ఫోటోస్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. అలాగే విశాల్ కూడా తన మీద వైసీపీ ముద్ర పడుతుంది అని అంచనా వేసి బాలన్స్ చెయ్యాలని సూపర్ ప్లాన్ వేశాడు. రీసెంట్ గా పవన్ కళ్యాణ్ ను కూడా పొగుడుతూ కామెంట్స్ చేశాడు. తెలుగు సినిమాల లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి పెద్ద ఫ్యాన్ అని, సూపర్ స్టైల్ పవన్ సొంతం అని అన్నారు. తన సినిమాలు సూపర్ గా ఉంటాయని చెప్పాడు.

అదే విధంగా పనిలో పనిగా రాజకీయాల గురించి కూడా చెబుతూ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇష్టమని తెలిపారు. ఓటేసే అవకాశం వస్తే ఇక్కడ తన ఓటు జగన్ కి వేస్తా అని అన్నాడు విశాల్. ఇలా వాళ్ళని వీళ్ళని కవర్ చేస్తూ మాంచి రాజకీయ నాయకుడి గా చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి.

Read more RELATED
Recommended to you

Latest news