నా పెళ్లి డేట్ నెలకోసారి మారుస్తారు, రామ్ చరణ్ హీరోయిన్ ఆవేదన…!

-

ఏ మాటకి ఆ మాట గాని హీరోయిన్లకు సంబంధించి ఏదైనా వార్త వస్తే చాలు సోషల్ మీడియాలో జరిగే హడావుడి అంతా ఇంతా కాదనే చెప్పాలి. మీడియా చేసే అతి కూడా ఒక రేంజ్ లో ఉంటుంది. ముఖ్యంగా ప్రేమ వ్యవహారాల విషయంలో మీడియా ఎక్కువగా హడావుడి చేస్తూ ఉంటుంది. చిన్న చిన్న విషయాలకు అతిగా ఆసక్తి చూపించి కనీసం వాళ్ళు ఇబ్బంది పడుతున్నారా లేదా అనేది కూడా ఆలోచించే పని ఉండదు. ఎవరికి తోచిన కథనాలు వాళ్ళు రాస్తూ ఉంటారు. సోషల్ మీడియాలో ఫాన్స్ ముసుగులో ఉండే కొందరు సైకోలు అయితే నోటికి వచ్చిన రాతలు రాస్తారు.

అసలు నిజమో కాదో తెలియకుండానే హడావుడి చేస్తూ ఉంటారు. ప్రేమలో ఎవరైనా ఉంటే చాలు పెళ్లి చేసుకుంటున్నారు అంటూ మాట్లాడేస్తారు కొందరు. పాపం ఇదే ఒక హీరోయిన్ ని తెగ ఇబ్బంది పెట్టేసింది. తన పెళ్లి గురించి జరుగుతున్న ప్రచారం పై బాలీవుడ్ హీరోయిన్ అలియా బట్ స్పందించింది. రణబీర్ కపూర్ తో ఈ అమ్మాయి కొన్ని రోజులుగా ప్రేమలో ఉంది. దీనితో మీడియాలో వీళ్ళు పెళ్లి చేసుకోవడం పక్కా అనే ప్రచారం ఎక్కువగా జరుగుతుంది. దీనిపై ఆమె సీరియస్ అయింది.

ముంబై లో ఆమె ఇటీవల ఒక కార్యక్రమానికి వెళ్ళింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ… మీరు త్వరలో పెళ్లి చేసుకుంటారు కదా అని మీడియా అడగగా… నా గురించి ఎప్పుడెలాంటి వార్తలు వస్తాయో నాకే తెలియదని ఆశ్చర్యంగా మాట్లాడింది. నెలకోసారి నా పెళ్లి తేదీ గురించి మీడియాలో వార్తలు వస్తుంటాయని చెప్పింది. వాటిని నేను సీరియస్‌గా తీసుకోనని కొట్టి పారేసింది. ఎందుకంటే అందులో వినోదం తప్ప ఇంకేమీ ఉండదని స్పష్టం చేసింది. రణబీర్ తో ఈమె ప్రస్తుతం బ్రహ్మాస్త్ర అనే సినిమాలో నటిస్తుండగా తెలుగులో రామ్ చరణ్ సరసన ఆర్ఆర్ఆర్ లో నటిస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news