టాలీవుడ్ దర్శక దిగ్గజం ఎస్ ఎస్ రాజమౌళి ప్రస్తుతం ఎన్టీఆర్, రామ్ చరణ్ లతో కలిసి ఆర్ఆర్ఆర్ అనే భారీ మల్టీస్టారర్ మూవీ ని తీస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే చాలా వరకు షూటింగ్ ని జరుపుకున్న ఈ సినిమా తాజా షెడ్యూల్ ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతున్నట్లు తెలుస్తోంది. రామ్ చరణ్ అల్లూరిగా, అలానే ఎన్టీఆర్ కొమరం భీం గా నటిస్తున్న ఈ సినిమాపై మన దేశంతో పాటు విదేశాల్లో ఉన్న తెలుగు వారిలో కూడా తీవ్రమైన ఆసక్తి నెలకొని ఉంది. ముందుగా ఈ సినిమాని ఈ ఏడాది జులై 30న రిలీజ్ చేయాలని భావించినప్పటికీ, సినిమా యొక్క క్వాలిటీ మరింతగా పెంచాలని, అలానే సినిమాకు సంబంధించి గ్రాఫిక్, విజువల్ ఎఫెక్ట్స్ వంటివి మరికొంత పెండింగ్ ఉండడంతో కొంత ఆలోచన చేసిన రాజమౌళి,
ఈ సినిమాని ఏకంగా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ఫిక్స్ అయ్యారు. ఇకపోతే మరోవైపు రామ్ చరణ్ కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ తో పాటు మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ వారు సంయుక్తంగా నిర్మిస్తున్న మెగాస్టార్ 152 వ సినిమా కూడా శరవేగంగా షూటింగ్ ని జరుపుకుంటోంది. కొరటాల శివ దర్శకత్వంలో ఒక పవర్ఫుల్ యాక్షన్ స్టోరీ తో తెరకెక్కుతున్న ఈ సినిమాని మొదట దసరా కానుకగా రిలీజ్ చేయాలని భావించిందట యూనిట్. అయితే షూటింగ్ కి మరింత సమయం పట్టనుండడంతో ఒకేసారి సంక్రాంతికే ప్రేక్షశకుల ముందుకు తీసుకువద్దాం అని భావించడం జరిగిందట.
అయితే అదే సమయంలో అనూహ్యంగా ఆర్ఆర్ఆర్ రిలీజ్ డేట్ ని రాజమౌళి అనౌన్స్ చేయడంతో ప్రస్తుతం చిరు సినిమా రిలీజ్ పరిస్థితి చిక్కుల్లో పడిందని, ఆ విధంగా తన సినిమాతో రాజమౌళి, అటు చరణ్ ని, ఇటు మెగాస్టార్ ని ఇద్దరినీ కూడా ఇరకాటంలో పెట్టినట్లు చెప్తున్నారు. మరోవైపు మెగాస్టార్ మాత్రం సినిమాని వీలైనంత త్వరగా రిలీజ్ చేయాలని భావిస్తున్నప్పటికీ, చరణ్ మాత్రం ఎటు తేల్చుకోలేకపోతున్నాడని, ఒకరకంగా ఇది వారి ఫ్యామిలీ లో మెగాస్టార్, మెగాపవర్ మధ్య కొద్దిపాటి చిక్కులకు కారణం అవుతోందని అంటున్నారు…..!!