ఈ చిన్నది ఇప్పుడు హీరోయిన్.. ఎవరో చెప్పుకోండి చూద్దాం!

-

కింది ఫోటోను చూశారు కదా. పెద్ద పెద్ద కళ్లు.. క్యూట్​ ఫేస్​తో చూడగానే ముద్దొచ్చే ఈ పాపాయి ఇప్పుడు హీరోయిన్​. తెలుగులో చేసింది తక్కువ సినిమాలే అయినా.. ఫ్యాన్స్​ను బాగానే సంపాదించుకుంది. మహానటి కీర్తి సురేష్‏కు చిన్నప్పటి నుంచి బెస్ట్ ఫ్రెండ్​. ఎవరో గుర్తుపట్టగలరా?

గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో సినీ తారల త్రోబ్యాక్ ఫోటోస్ వైరలవుతున్నాయి. అందులో ఇప్పటికే మీరు చాలా మంది సెలబ్రెటీల చిన్ననాటి ఫోటోస్ చూసే ఉంటారు. తాజాగా మరో హీరోయిన్​కు సంబంధించిన చిన్ననాటి ఫొటో చక్కర్లు కొడుతోంది. ఆమె ఎవరో తెలుసుకుందాం..

తెలుగులో ఈ అమ్మడు చేసింది తక్కువ సినిమాలే అయినా.. ఫ్యాన్​ ఫాలోయింగ్ బాగానే ఉంది. ఈమె మహానటి కీర్తి సురేష్‏కు చిన్నప్పటి నుంచి ప్రాణ స్నేహితురాలు. నితిన్​ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైంది. అలాగే ఎన్నో తమిళ చిత్రాల్లో నటించి మెప్పించింది. ఇంతకీ ఎవరో గుర్తుపట్టగలిగారా.. ఎవరో కాదు ఈమె మేఘా ఆకాష్​. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ ప్రేమదేశం, మనుచరిత్ర, సింగిల్​ షంకరుమ్​ స్మార్ట్​ఫోన్​ సిమ్రనుమ్​, రావణాసుర సహా పలు చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news