హీరోయిన్ ప్రణీత సుభాష్ బేబీ బంప్ ఫోటోలు వైరల్..

-

ప్రణీత సుభాష్’ ఏం పిల్లో ఏం పిల్లడో’ సినిమాతో టాలీవుడ్ కు పరిచయమై, బావ మూవీతో గుర్తింపు సంపాదించుకుని, అత్తారింటికి దారేది చిత్రంలో బాపు బొమ్మగా మరింత క్రేజ్ తెచ్చుకుంది. కాగా ప్రణీత 2021 మే 30న వ్యాపారవేత్త నితిన్ రాజు ను పెళ్లాడింది. తాజాగా తాను ప్రెగ్నెంట్ అని తెలిసిన దగ్గర నుంచి అమ్మ అని పిలిపించుకోవడానికి ఎంతగానో తహతహలాడుతుంది ప్రణీత.

తాజాగా ఆమె సోషల్ మీడియాలో బేబీ పంప్ ఫోటోలు షేర్ చేసింది. భర్తతో కలిసి దిగిన బ్యూటిఫుల్ ఫోటోలను అభిమానులతో పంచుకుంది. ప్రణీతను ఇలా చూసిన ఫ్యాన్స్ అందమైన యువరాణి లా ఉన్నారు, ఐ లవ్ యూ అంటూ కామెంట్లు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news