అప్పుడు పెళ్ళి చూపులు.. ఇప్పుడు వరుడు కావలెను.

పెళ్ళిచూపులు సినిమా ద్వారా తెలుగు తెరకి పరిచయమైన రీతూ వర్మ, ఆ సినిమాతో మంచి హిట్ అందుకుంది. ఆ తర్వాత నిఖిల్ హీరోగా కేశవ సినిమా చేసినప్పటికీ అదంత పెద్దగా పేరు తెచ్చిపెట్టలేదు. ఐతే తెలుగులో పెద్దగా అవకాశాలు లేకపోయినా తమిళంలో రీతూ వర్మ కెరీర్ జోరుగా సాగుతుంది. తాజాగా తెలుగులోనూ మళ్ళీ అవకాశాలు వస్తున్నాయి. ప్రస్తుతం నాని హీరోగా టక్ జగదీష్ చిత్రంలో రీతూ వర్మ హీరోయిన్ గా కనిపిస్తుంది.

ఇంకా నాగశౌర్య హీరోగా మరో సినిమా ప్రకటన వచ్చేసింది. సితార ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ లో రూపొందుతున్న ఈ సినిమా నుండి ఫస్ట్ గ్లింప్స్ రిలీజైంది. వరుడు కావలెను అనే టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్లో నిర్మితం అవుతుంది. విశాల్ చంద్ర శేఖర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకి లక్ష్మీ సౌజన్య దర్శకత్వం వహిస్తున్నారు.