కరోనా సృషిస్తున్న విపత్తుతో ఎంతో మంది చాలా విధాలుగా ఇబ్బందులు పడుతున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా చిత్ర పరిశ్రమలో రెక్కాడితే గాని డొక్కాడని పరిథితుల్లో వందల కుటుంబాలున్నాయి. షుటింగ్ ఉంటే మూడు పూటలా కడుపు నిండా తిండి దొరుకుంది. లేదంటే ఆ రోజుకు పస్తులే అన్న పరిస్థితి ఈ నాటికి చాలా మంది కార్మీకులకి ఎదురవుతున్న సమస్య… అనుభవిస్తున్న బాధలు. అలాంటిది నెలలపాటు షూటింగ్స్ లేకపోతే వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు తలెత్తుతాయో ఊహించుకుంటేనే గుండె తరుక్కుపోతుంది. తెల్లవారి 4 గంటలకే సినీ కార్మీకులు ఇంద్రానగర్ గడ్డ మీద పనులకోసం పడిగాపులు కాయడం మొదలవుతుంది.
ఆరోజు షూటింగ్ కి వెళితే తమ కుటుంబ పోషనకి డబ్బు వస్తుంది. పొట్ట నుండుతుంది. లేదంటే ఒక్కపూట తిండి ఎవరు పెడతారా అంటూ ఎదురు చూడాల్సిందే. అలాంటి వాళ్ళకోసం మెగాస్టార్ ఒక కమిటీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. సినీ కార్మీకులను ఆదుకునేందుకు కరోనా క్రైసిస్ ఛారిటీ ( c c c ) పేరుతో చిరంజీవి ఆధ్వర్యంలో ఒక సంస్థ ఏర్పడి సినీ కార్మికుల ఆకలి తీర్చుతున్న విషయం తెల్సిందే. ఈ విషయంలో స్వయంగా చిరంజీవి అందరికి ఫోన్ కాల్ ద్వారా విరాళాలు సమర్పించమని సూచిస్తున్నారు. స్వయంగా చిరంజీవి అంతటి వారే ఇలా అడగడంతో చిత్ర పరిశ్రమలోని వారందరూ ఒకే తాటిపైకి వచ్చి పేదలను ఆదుకునేందుకు సహాయం అందిస్తున్నారు.
అయితే ముఖ్యంగా గత కొన్ని రోజులుగా హీరోయిన్స్ మీద సోషల్ మీడియాలో బాగా కామెంట్స్ వస్తున్నాయి. కోట్లలో రెమ్యూనరేషన్ తీసుకోవడం తెలుసు గాని ఇలాంటి విపత్తుల్లో ప్రజలను ఆదుకోవడం తెలీదా ..మీకు సామాజిక బాధ్యత లేదా అంటూ విమర్శలు వెల్లువెత్తాయి. అయితే కొంతమంది హీరోయిన్ మాత్రం సహాయం చేసినప్పటికి దాన్ని పబ్లిసిటి కోసం ఉపయోగించుకోకపోవడం గమనర్హం. ముఖ్యంగా అలాంటి వాళ్ళలో కాజల్ అగర్వాల్, తమన్న భాటియా, లావణ్య త్రిపాఠి ఉన్నారు. చిరంజీవి అడిగీ అడగానే వెంటనే స్పందించి తమవతు సహాయం అందించారు. కాని ఇది చేసినట్టు ఎక్కడా చెప్పుకోకపోవడం ఎంతో గొప్ప విషయం.