మందార ఆకులని నూరి తలకు పట్టిస్తే జుట్టు సమస్యలు తొలగిపోతాయని మనకు తెలుసు. కానీ మనకు తెలియని చాలా విషయాలు మందార ఆకుల లో దాగి ఉన్నాయి. మందార ఆకుల వల్ల కలిగే ఉపయోగాలు చాలా ఉన్నాయి. మరి ఆలస్యం ఎందుకు వాటిని గురించి ఒక లుక్ వేసేయండి. ఆయుర్వేదం లో కూడా మందారాన్ని ఉపయోగిస్తూ ఉంటారు. మందార ఆకులు రోగ నిరోధక శక్తిని పెంచడానికి బాగా ఉపయోగ పడతాయి.
అలానే ఇది తక్షణ ఎనర్జీని ఇస్తుంది కూడా. మందార ఆకులు మొటిమలను నివారిస్తుంది. మందార ఆకుల లో కాస్మెటిక్ చర్మ సంరక్షణకు ఉపయోగపడే గుణాలు ఉన్నాయి. వీటి వల్ల ముడతలు తగ్గుతాయి. అలానే మచ్చలు వంటివి కూడా తొలగి పోతాయి. మందార ఆకులు కొలెస్ట్రాల్ ని తగ్గిస్తుంది. మందార ఆకులు వల్ల కొలెస్ట్రాల్ లెవల్స్ ను తగ్గించుకోవచ్చు. అలానే ఇది బాడీ టెంపరేచర్ ని కూడా మెయింటెన్ చేస్తుంది.
జలుబు మరియు దగ్గును కూడా మందార ఆకులు నివారిస్తుంది. మందార ఆకులలో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. దీనితో కనుక టీ లేదా మరి ఏ రూపం లో తీసుకున్నా రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. దీంతో జలుబు మరియు దగ్గుని తగ్గించడానికి ఉపయోగ పడుతుంది. మీరు క్రమం తప్పకుండా మందార నూనెను తలకు పట్టిస్తే జుట్టు రాలడం తగ్గుతుంది.
తద్వారా ఒత్తుగా ఎదుగుతుంది. అలాగే చుండ్రు కూడా తగ్గిపోతుంది. అంతే కాదండి జుట్టు స్ట్రాంగ్ గా, హెల్దీగా ఎదుగుతుంది. క్యాన్సర్ తో పోరాడుతుంది. మందార ఆకుల్ని వేడి నీటి లో వేసి ఆ నీటిని తాగితే కూడా మంచి ప్రయోజనాలు ఉంటాయి. చూసారా ఎన్ని ప్రయోజనాలో..! సులువైన ఈ పద్ధతులని అనుసరించండి. సమస్యల నుండి బయట పడండి.