సూర్య కెరీర్‌లోనే హై బడ్జెట్ మూవీ …. త్రీడీలో కూడా రిలీజ్…!

-

శివ దర్శకత్వంలో తమిళ నటుడు సూర్య నటిస్తున్న తాజా చిత్రం కంగువ .పాన్ వరల్డ్ మూవీగా భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.ఈ మూవీ పది భాషల్లో విడుదల కానుంది.సూర్య 5 విభిన్న పాత్రల్లో కనిపించనున్న ఈ సినిమా రెండు భాగాలుగా విడుదల చేయనున్నారు. ఈ చిత్రం గురించి మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియా లో వైరల్ అవుతోంది. స్టార్ హీరో సూర్య కెరీర్‌లోనే ఇది హై బడ్జెట్ సినిమా అట. ఇక 10 భాషల్లో వస్తున్న ఈ చిత్రం త్రీడిలో కూడా విడుదల చేయడం విశేషం.

స్టూడియో గ్రీన్-యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. 2024లో ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. కంగువ లో దిశాపటాని హీరోయిన్గా నటిస్తుంది .బాబీ డియోల్ కీలకపాత్రలో నటిస్తున్నాడు. ఈ చిత్రానికి ఫేమస్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నాడు.గతానికి, ప్రస్తుతకాలానికి మధ్య ఉండే కనెక్షన్‌తో సాగే స్టోరీలైన్‌ ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నట్టు తెలుస్తుంది.నటుడు సూర్య సుధా కొంగర దర్శకత్వంలో తన 43వ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news