వనమా రాఘవకు ఊరట.. బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు

-

పాల్వంచలో వ్యాపారి రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య తెలంగాణలో రాజకీయంగా కలకలం రేపిన సంగతి తెలిసిందే. రామకృష్ణ చనిపోయే ముందు సెల్ఫీ వీడియో ద్వారా కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర్ రావు కుమారుడు వనమా రాఘవేంద్ర పై సంచలన ఆరోపణలు చేశాడు. ఈ నేపథ్యంలోనే ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర్ రావు కుమారుడు వనమా రాఘవేంద్ర.. పోలీసులు అరెస్ట్ చేశారు.

అయితే ఈ కేసు లో వనమా వెంకటేశ్వరరావు కుమారుడు వనమ రాఘవకు హైకోర్టు లో ఊరట లభించింది. వనమా రాఘవకు బెయిల్ మంజూరు చేసింది తెలంగాణ హై కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. అయితే షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది తెలంగాణ హై కోర్టు.

వనమా రాఘవ లైంగిక వేదింపులకు భయపడి కుటుంభం నలుగురు ఆత్మహత్య చేసుకోగా..ఆ కేసు లో అరెస్ట్ అయ్యి.. 61 రోజులు జైల్లో ఉన్నాడు వనమ రాఘవ.. కొత్తగూడెం నియోజక వర్గంలో అడుగు పెట్టకుండా ఉండాలని షరతు విధించింది హైకోర్టు. ప్రతి శనివారం ఖమ్మం వన్ టౌన్ పోలీసు స్టేషన్ లో సంతకం పెట్టాలని షరతు విధించింది తెలంగాణ హై కోర్టు.

Read more RELATED
Recommended to you

Exit mobile version