మాజీ మంత్రి వైసీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డితో సహా 12 మందికి హైకోర్టు నోటీసులు

-

మాజీ మంత్రి వైసీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో పాటు 12 మంది అనుచరులు తనపై దాడి చేసి, తప్పుడు కేసులు నమోదు చేశారని, మాజీ జడ్జి రామకృష్ణ హైకోర్టులో పిల్ దాఖలు చేశారు.ఈ పిల్‌పై విచారణ చేపట్టిన హైకోర్టు పెద్దిరెడ్డి, తంబల్లిపల్లి ఎమ్మెల్యే ద్వారకానాథ్ రెడ్డితో సహా 12 మందికి వారంలోపు వివరణ ఇవ్వాలని నోటీసులు జారీ చేసింది. రామకృష్ణ చేసిన ఫిర్యాదులపై రిపోర్టును సమర్పించాలని అన్నమయ్య ఎస్పీని కూడా ఆదేశించింది.

ఈ నేపథ్యంలో మాజీ జడ్జి రామకృష్ణ మాట్లాడుతూ ”ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పెద్దిరెడ్డి, ఆయన కుటుంబ సభ్యులు దౌర్జన్యాలు, దుర్మార్గాలు, అవినీతికి పాల్పడ్డారు అని అన్నారు. ఎవరైనా ప్రశ్నిస్తే వారి కుటుంబాలపై గంజాయి, రౌడీ ముఠాలను ప్రేరేపించి దాడులకు పాల్పడ్డారు. తనకున్న అధికారాన్ని అడ్డుపెట్టుకుని పోలీసుల ద్వారా బాధితులపైనే తప్పుడు కేసులు పెట్టించి జైల్లో పెట్టించారు. పెద్దిరెడ్డి దుర్మార్గపు చర్యలకు అఘాత్యాలకు మూల్యం చెల్లించుకునే రోజు దగ్గర్లో ఉంది. ” అని హెచ్చరించారు.

Read more RELATED
Recommended to you

Latest news