రాజు మృతి పై జ్యుడీషియల్‌ విచారణకు హై కోర్టు ఆదేశం

-

చిన్నారి చైత్ర కేసు లో నిందితుడు రాజు ఆత్మహత్య పై జ్యుడీషియల్‌ విచారణ కు ఆదేశించింది తెలంగాణ రాష్ట్ర హైకోర్టు. నిందితుడు రాజు ఆత్మహత్య పై పలు అనుమానాలు ఉన్నాయంటూ హైకోర్టు ను ఆశ్రయించింది పౌర హక్కుల సంఘం. ఇందులో భాగంగానే … ఇవాళ ఉదయం తెలంగాణ హైకోర్టు లో పిటిషన్ వేశారు సంఘం ప్రధాన కార్యదర్శి లక్ష్మణ్.

ఈ నేపథ్యం లోనే లాంచ్ మోషన్ పిటిషన్ ను విచారించింది తెలంగాణ హై కోర్టు. రాజు ఆత్మహత్య ఘటనపై జ్యూడీషియల్ ఎంక్వరీ కి ఈ సందర్బంగా హై కోర్టు ఆదేశించింది. వరంగల్ మూడో మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ ను జుడిషియల్ అధికారిగా నియమించింది హై కోర్టు. నాలుగు వారాల్లో సమగ్ర నివేదికను కోర్ట్ కు సమర్పించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. కాగా… నిన్న ఉదయం 9 గంటల ప్రాంతం లో నిందితుడు రాజు… కోణార్క్‌ ఎక్స్‌ ప్రెస్‌ కింద పడి ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news