చెన్నమనేని రమేష్ పౌరసత్వం పై నేడు హై కోర్టులో విచారణ జరిగింది. ఇక దీనికి సంబంధించి గతంలో ఒక అఫిడఫిట్ జారీ చేయాలని కేంద్ర హోం శాఖను కోరగా ఈరోజు దాఖలు చేయలేదు. కేవలం కేంద్ర హోం శాఖ మెమో దాఖలు చేసింది. చెన్నమనేని రమష్ పౌరసత్వం పై ఎంబసీ నుండి పూర్తి వివరాలు తెలుసుకుని కౌంటర్ అఫిడవిట్ వేయాలని నవంబర్ 18 న కేంద్ర హోం శాఖను హై కోర్ట్ ఆదేశించింది.
అఫిడఫిట్ దాఖలు చేయకపోవడం పై హై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎంబసీ నుండి పౌరుని వివరాలు రబట్టలేక పోతే ఎందుకు మీ హోదాలు అని హై కోర్ట్ ప్రశ్నించింది. ఫిబ్రవరి 2020లో చెన్నమనేని రమేష్ జర్మన్ పౌరుడు అని ఇచ్చిన మెమోనే మళ్ళీ ఇవ్వడం పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది హై కోర్టు. మరో మారు అవకాశం ఇస్తున్నాం జర్మన్ ఎంబసీ నుండి పూర్తి సమాచారం తీసుకుని అఫిడవిట్ వేయాలని కేంద్ర హోం శాఖకు హై కోర్ట్ ఆదేశాలు జారీ చేసింది.