ధరణి పోర్టల్ విషయంలో టీసర్కార్ కి హైకోర్టు షాక్

-

తెలంగాణా ప్రభుత్వం ఎంతో కీలకంగా భావిస్తోన్న ధరణి పోర్టల్ విషయంలో తెలంగాణా సర్కార్ కి హైకోర్టు షాకిచ్చింది. ధరణి పోర్టల్ లో వివరాల నమోదు అంశం మీద మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది హైకోర్టు. ధరణి పోర్టల్ లో వ్యవసాయ ఆస్తుల నమోదుకు ఒత్తిడి చేయ వద్దని ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటి వరకు సేకరించిన వివరాలను కూడా బయటి వ్యక్తులకు ఇవ్వ వద్దని, ఏ చట్టం ప్రకారం ఆధార్‌, కులం వివరాలు సేకరిస్తున్నారని హైకోర్టు ప్రశ్నించింది. కొత్త రెవెన్యూ చట్టం వ్యవసాయ భూములకు సంబంధించింది మాత్రమేనని, కొత్త రెవెన్యూ చట్టంలో వ్యవసాయేతర భూముల ప్రస్తావన ఎక్కడుంది? అని ప్రబుత్వాన్ని ప్రశ్నించింది.

అలానే వ్యక్తిగత వివరాలకు భద్రత ఎలా కల్పిస్తారని ప్రశ్నించిన హైకోర్టు డేటా భద్రతకు సంబంధించి కొత్త రెవెన్యూ చట్టంలో ప్రస్తావనే లేదని తెలిపింది. అసలు వ్యవసాయ ఆస్తుల నమోదులో ఆధార్‌ వివరాల కోసం ఒత్తిడి చేయవద్దనని ఆదేశించిన హైకోర్టు ఇప్పటి వరకు సేకరించిన వివరాలను బయటి వ్యక్తులకు ఇవ్వొద్దని పేర్కొంది. అలానే అసలు ఏ చట్టం ప్రకారం ఆధార్‌, కులం వివరాలు సేకరిస్తున్నారని హైకోర్టు ప్రశ్నించింది. అయితే డేటా భద్రతకు అన్ని చర్యలు తీసుకున్నట్లు ఏజీ హైకోర్టుకు తెలిపారు. ఏజీ కౌంటర్ దాఖలుకు రెండు వారాలు గడువు కోరగా తదుపరి విచారణని ఈ నెల 20కి వాయిదా వేసింది హైకోర్టు. అలానే చట్టబద్ధత, డేటా భద్రతపై పూర్తి వివరాలు సమర్పించాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version